Share News

హామీల అమలు కోసం పోరాటం

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:06 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు ఎన్నికల సందర్భంగా, అంతకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పార్టీ శ్రేణులకు సూచించారు.

హామీల అమలు కోసం పోరాటం
తరగతుల్లో మాట్లాడుతున్న వెంకటస్వామి

- సీపీఎం రాజకీయ శిక్షణా తరగతుల్లో జిల్లా కార్యదర్శి వెంకటస్వామి

గద్వాల టౌన్‌, జూన్‌ 10 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు ఎన్నికల సందర్భంగా, అంతకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పార్టీ శ్రేణులకు సూచించారు. గద్వాల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ధరూరు, గద్వాల, ఇటిక్యాల మండాలలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభ మయ్యాయి. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ రాజ్యాంగ పరరిరక్షణ, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రిజర్వేషన్ల భద్రత తదితర హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు, గృహలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి పథకాల అమలులో మరింత వేగం, సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలన్నారు. విద్వేష రాజకీయ విధానాలను వ్యతిరేకించడంతో పాటు సామాజిక చైతన్యమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఉప్పేరు నర సింహ, మండల కార్యదర్శులు మేకల నరసింహ, రామకృష్ణ, కల్యాణ్‌, వీరేష్‌, దేవదాసు, బాలరాజు, రామాంజ నేయులు, మహేష్‌, శివ, అంజి పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:06 PM