Share News

బీజేపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత

ABN , Publish Date - May 08 , 2024 | 11:50 PM

కేంద్రంలో బీజేపీ పది సంవత్సరాల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు.

బీజేపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత
ఉండవల్లి గ్రామంలో స్థానికులతో మాట్లాడుతున్న సంపత్‌ కుమార్‌

- ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌

ఉండవల్లి/ ధరూరు/ మల్దకల్‌/ మే 8 : కేంద్రంలో బీజేపీ పది సంవత్సరాల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌ నాగర్‌ కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా బుధవారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు గోపాల్‌, స్థానిక నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్‌ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మ రించి, కుల మతాల మధ్య చిచ్చు పెడుతోందని ఎద్దేవా చేశారు. గడీల పాలన బద్దలు కొడతామని, బహుజనుల పక్షాన నిలబడి పోరాడుతానని ప్రగ ల్భాలు పలికిన బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి, ఇప్పుడు అవినీతి పాలనకు పునాదులు వేసే ప్రయత్నంలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి చూపించిందన్నారు. కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు. అనంతరం పోస్టాఫీస్‌ వద్ద ఆసరా పెన్షన్‌ కోసం వచ్చిన వృద్ధులతో మాట్లాడారు. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరిన మారమునగాల-2 గ్రామానికి చెందిన ఇతర పార్టీల కార్యకర్తలకు కండువా కప్పి ఆహ్వానించారు. వారితో పాటు సీపీఎం, సీపీఐ నాయకులు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌ గౌడ్‌, నాగరాజు, రమేశ్‌, జంగాల మద్దిలేటి, మైనారిటీ మండల అధ్యక్షుడు నయ్యూమ్‌, దామోదరగౌడ్‌, రవికుమార్‌, వెంకటేశ్వర్లు, నరసింహ పాల్గొన్నారు.

- కాంగ్రెస్‌ పార్టీ నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా బుధవారం మల్దకల్‌ గ్రామంలో ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఉప్పేరు కృష్ణ, ఏఐటీయుసీ నాయకులు కాశీం, వెంకటేష్‌, నాగేష్‌ పాల్గొన్నారు.

బీజేపీని గద్దె దించాలి

కేంద్రంలోని బీజేపీ పార్టీని ప్రజలు గద్దె దించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు బండ్ల చంద్ర శేఖర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ధరూరు మండల కేంద్రంలోని తన నివాసంలో బుధవారం సాయం త్రం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి బుద్ధి చెప్పినట్లుగానే, బీజీపీకి కూడా గుణపాఠం నేర్పాల న్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ బండారి భాస్కర్‌, ధరూరు మండల నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి, నరేందర్‌ రెడ్డి, దర్శన్‌రెడ్డి, జాకీర్‌, పాతపలెం శ్రీనివాసులు, ఆలూరు వెంక ట్రాములు, ప్రహ్లాద్‌, ధరూరు ఉప సర్పంచ్‌ సవా రన్న, రాజారెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు డీఆర్‌ శ్రీధర్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Updated Date - May 08 , 2024 | 11:50 PM