Share News

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:19 PM

కోస్గిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ తెలిపారు.

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌

నారాయణపేట, ఫిబ్రవరి 20 : కోస్గిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ తెలిపారు. నలుగురు ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 95 మంది ఎస్‌ఐలు, 75 మంది ఏఎస్‌ఐలు, 160 మంది హెచ్‌సీలు, 550 మంది పీసీలు, 250 మంది హెచ్‌జీలు, టీఎస్‌ఎస్‌పీప్టాటూన్స్‌ 8, పోలీస్‌ అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి పక్కాగా విధులు నిర్వర్థించాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, భారత్‌, రవి, డీఎస్పీ లింగ య్య, వెంకటేశ్వరరావు, సీఐలు, ఎస్‌ఐలు తది తరులు పాల్గొన్నారు.

ఐజీపీకి స్వాగతం పలికిన ఎస్పీ

పేట రూరల్‌ పీఎస్‌, ధన్వాడ పీఎస్‌ భవన నిర్మాణాలను పరిశీలించడానికి వచ్చిన ఐజీపీ, ఇన్‌చార్జి హౌజింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ రమేష్‌రెడ్డికి మంగళవారం ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ పూల మొక్కను అందించి స్వాగతం ప లికారు. ఆయా పీఎస్‌ నిర్మాణ పనులను పరిశీ లించి త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని కాంట్రాక్టర్లకు ఆయన సూచించారు.

Updated Date - Feb 20 , 2024 | 11:20 PM