Share News

గ్రూప్‌-1 పరీక్షకు పటిష్ట బందోబస్తు

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:49 PM

నాగర్‌కర్నూ ల్‌ జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రూప్‌-1 పరీక్ష సంద ర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉన్న 18 పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

 గ్రూప్‌-1 పరీక్షకు పటిష్ట బందోబస్తు

- ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌

నాగర్‌కర్నూల్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూ ల్‌ జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రూప్‌-1 పరీక్ష సంద ర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉన్న 18 పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల దగ్గర జిరాక్స్‌ సెంటర్లు, ఇంటర్నెట్‌ సెంట ర్లు గాని ఇతర వేరే షాపులను కూడా మూయించడం జరుగుతుందన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం దగ్గర ఐదుగు రు పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తు న్నామని, బయోమెట్రిక్‌ కూడా ఉంటుందన్నారు. కావున పరీక్ష రాసే విద్యార్థులు గంట ముందు పరీక్ష కేంద్రాల దగ్గరికి వచ్చిన వాళ్ల పరీక్ష కేంద్రాల్లో వెళ్లాల్సిందిగా తెలి పారు. నిమిషం ఆలస్యం అయినా లోనికి పంపడానికి వీలు లేదని హాల్‌ టికెట్‌, ఐడీ కార్డు అన్ని జాగ్రత్తగా చూసుకుని పరీక్ష కేంద్రాలకు రావాల్సిందిగా తెలిపారు. మీ పరీక్ష కేంద్రాల ఏరియాకు మీకు తెలియకుంటే నాగర్‌కర్నూల్‌ బస్టాండ్‌ దగ్గర యూనిఫామ్‌లో మూడు టీమ్‌లు ఆరుగురు పోలీసులు ఉంటారన్నారు. వారిని ప రీక్ష కేంద్రాల అడ్రస్‌ అడిగి తెలుసుకుని మీ పరీక్ష కేం ద్రాలకు వెళ్లాల్సిందిగా ఎస్పీ తెలిపారు. ఏమైనా అనివార్య కారణాల వల్ల ఆలస్యమైతే బస్టాండ్‌ దగ్గర నుంచి అక్క డ ఉన్న సిబ్బంది పోలీస్‌ వా హనాలలో విద్యార్థులను పరీ క్ష కేంద్రాల దగ్గర చేరు స్తారని ఎస్పీ తెలిపారు.

ఏర్పాట్లు సిద్ధం

తెలకపల్లి: మండల కేంద్రంలో ఆదివారం నిర్వహిం చే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు సెంటర్ల నిర్వాహకులు శనివారం తెలిపారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలి కల పాఠశాల సెంటర్‌లో 288 మంది, గోవర్ధన్‌ రెడ్డి డిగ్రీ కళాశాలలో 312 మంది మొత్తం రెండు సెంటర్లలో 600 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు వారు తెలిపా రు. ఈ రెండు సెంటర్లలోని ఇన్విజిలేటర్లకు సమావేశం నిర్వహించి తగు సూచనలు, సలహాలు చేసినట్లు వారు తెలిపారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఉదయం 9గంటల కు పరీక్ష సెంటర్‌కు చేరుకోవాలని వారు తెలిపారు. ఆయా సెంటర్ల చీఫ్‌ సూపరిటెండెంట్‌లు, నిర్వాహకులు తిరుపతయ్య, వి.రాజమహేందర్‌రెడ్డి, ఎం.ప్రకాశ్‌రెడ్డి, ఎస్‌.సందీప్‌కుమార్‌, ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 10:49 PM