Share News

అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - May 31 , 2024 | 11:32 PM

ఎవరైనా మహిళలు, యువతలతో అసభ్యంగా ప్రవర్తించి, వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీటీం సభ్యులు హెచ్చరించారు.

అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు
రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్న షీ టీం సభ్యులు

- షీటీం సభ్యుల హెచ్చరిక

- రైల్వే స్టేషన్‌లో అవగాహన కార్యక్రమం

గద్వాల క్రైం, మే 31 : ఎవరైనా మహిళలు, యువతలతో అసభ్యంగా ప్రవర్తించి, వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీటీం సభ్యులు హెచ్చరించారు. మహిళల భద్రతే షీటీం లక్ష్యమన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఎవరైనా అసభ్యంగా మాట్లాడినా, ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసినా, వెంటపడి వేధించినా వెంటనే షీటీం నంబర్‌ 8712679312కు ఫిర్యాదు చేయాలని మహిళలు, యువతులకు సూచించారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్క డైనా బాల్య వివాహాలు జరిగినా, జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, 100 నెంబర్లకు కాల్‌ చేయాలని కోరారు. చిన్న కేసు నమోదైనా ప్రభుత్వ ఉద్యోగం అనర్హులు అవు తారని యువకులు తెలుసుకోవాలన్నారు. ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకుంటే బాలకార్మిక చట్టం క్రింద శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. ఈవ్‌టీజింగ్‌, మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, తదితర విషయాలపై అవగాహన కల్పించారు.

Updated Date - May 31 , 2024 | 11:32 PM