Share News

బియ్యపు గింజలపై శ్రీరామనామం

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:30 PM

అయిజ మండలం తుపతురాల గ్రామానికి చెందిన అర్చకుడు చక్రవర్తి ఆచార్యులు 35,000 బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని రాసి స్వామి భక్తిని చాటుకున్నాడు.

బియ్యపు గింజలపై శ్రీరామనామం
బియ్యపు గింజలపై శ్రీరామ నామం రాస్తున్న చక్రవర్తి, (ఇన్‌సెట్లో) బియ్యపు గింజలు

అయిజ, ఏప్రిల్‌ 15 : అయిజ మండలం తుపతురాల గ్రామానికి చెందిన అర్చకుడు చక్రవర్తి ఆచార్యులు 35,000 బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని రాసి స్వామి భక్తిని చాటుకున్నాడు. అదే గ్రామంలోని శ్రీరామాలయంలో అర్చకుడిగా పని చేస్తున్న ఆయన 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతీ సంవత్సరం రామనామాన్ని రాసిన బియ్యపు గింజలను సీతారామ కల్యాణోత్సవంలో అక్షింతలుగా విని యోగిస్తున్నారు. ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించనున్న కల్యాణోత్సవంలోనూ శ్రీరామ నామం రాసి ఉన్న బియ్యపు గింజలను అక్షింతలుగా ఉపయోగించనున్నారు.

Updated Date - Apr 15 , 2024 | 11:30 PM