Share News

క్రీడలతో యువతకు మానసికోల్లాసం

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:51 PM

క్రీడలు యువతకు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు.

క్రీడలతో యువతకు మానసికోల్లాసం
విజేత జట్టుకు కప్పు అందిస్తున్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు

- ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే విజయుడు

- విజేతలకు బహుమతుల ప్రదానం

రాజోలి/అయిజ, మార్చి 11 : క్రీడలు యువతకు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో భ్రరాంబికా అడివేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రాజోలి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఏడు జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సోమవారం నిర్వ హించిన బహుమతి ప్రదానోత్సవానికి ఆయనతో పాటు ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథులుగా హాజర య్యారు. టోర్నమెంట్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన డీఎన్‌ఎస్‌ జట్టుకు మొదటి బహుమతిని, దాత శ్రీరామ్‌ రెడ్డి కుమారుడు అభిషేక్‌రెడ్డి రూ. 25వేలను బహూక రించగా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల చేతుల మీదుగా అంద జేశారు. రెండవ బహుమతిని లలిత జట్టు కైవసం చేసుకోగా, వారికి ఎంపీటీసీ సభ్యుడు గోనెగండ్ల షాషావలి రూ.20 వేలు బహూకరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు స్వామి, అమ్మ వార్లను దర్శించుకొని పూజలు చేశారు.

ఉత్సవాలతో ప్రజల మధ్య సత్సంబంధాలు

ఉత్సవాలు ప్రజలు, ప్రాంతాల మధ్య సత్సం బంధాలను పెంపొందిస్తాయని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. అయిజ పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామిని సోమవారం ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. పర్వదినాల సందర్భంగా నిర్వహించే ఉత్సవాల్లో కుల, మత వర్గ బేధాలు లేకుండా గ్రామస్థులందరూ ఐకమత్యంతో పాల్గొంటారని భగవింతుడిపై ధ్యాస, పరోపకారం, సమాజసేవపై అంకిత భావం కలిగి ఉండాల న్నారు. అధ్యాత్మికత అలవరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు రాముడు, కౌన్సిలర్‌ ఖాజ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిన్న హన్మంతు, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు రాముడు, జోగుళాంబ ఆలయ కమిటీ మాజీ సభ్యుడు దేవర జయన్న, బీఆర్‌ఎస్‌ నాయకులు ఉశేని, వెంకటేష్‌, లక్ష్మన్న, రంగారెడ్డి, తిమ్మప్ప పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 10:52 PM