Share News

నందిన్నె చెక్‌పోస్ట్‌ వద్ద ప్రత్యేక నిఘా

ABN , Publish Date - Apr 12 , 2024 | 11:04 PM

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా తెలంగాణ - కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కేటీదొడ్డి మండలంలోని నందిన్నె చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

నందిన్నె చెక్‌పోస్ట్‌ వద్ద ప్రత్యేక నిఘా
నందిన్నె చెక్‌పోస్ట్‌ దగ్గర స్వాధీనం చేసుకున్న డబ్బుతో పోలీసులు

- ఎక్సైజ్‌, పోలీసు శాఖల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ

కేటీదొడ్డి, ఏప్రిల్‌ 12 : రానున్న పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా తెలంగాణ - కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కేటీదొడ్డి మండలంలోని నందిన్నె చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కర్ణాటక నుండి రాష్ట్రానికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కర్ణాటక నుంచి మద్యంతో పాటు నగదు రాష్ట్రంలోకి వచ్చే అవకా శాలు ఎక్కువగా ఉండడంతో అధికారులు నందిన్నె చెక్‌పోస్ట్‌ వద్ద నిఘా పెట్టారు. రానున్న రోజుల్లో చెక్‌ పోస్ట్‌తో పాటు సరిహద్దు గ్రామాల పరిధిలోనూ నిఘా ను పటిష్టం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తు న్నట్లు సమాచారం. ఆయా గ్రామాల్లో సంచరిస్తున్న కర్ణాటకకు చెందిన వ్యక్తులపై నిఘా పెంచినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కర్ణాటక సరిహద్దు సమీపం లోని తెలంగాణ గ్రామాలు చింతలకుంట, సుల్తాన్‌ పురం, ఎర్సన్‌దొడ్డి, కుచినెర్ల, నందిన్నె, గువ్వలదిన్నె, గువ్వలదిన్నె తండా, ఇర్కిచేడు, ఇర్కిచేడు తండా, పాగుంట గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం. నందిన్నె చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు నిర్వ హించిన వాహనాల తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 5,29,000 పట్టుబడింది. ఆ డబ్బు రైతులు, వ్యాపారులకు సంబంధించింది కావడంతో, బిల్లులు, ఆధారాలు చూపించి తీసుకెళ్లినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు.

డబ్బు, మద్యం తరలిస్తే కేసులు

శ్రీనివాస్‌రావు, ఎస్సై, కేటీదొడ్డి : ఎక్కువ మొత్తంలో డబ్బు, మద్యం తరలిస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో నందిన్నె చెక్‌పోస్ట్‌ దగ్గర జరుగుతున్న తనిఖీలకు ప్రజలు సహకరించాలి. రైతులు, వ్యాపారులు డబ్బులు తీసుకెళ్తే, అందుకు సంబం ధించిన బిల్లులు, రశీదులను వెంట ఉంచుకోవాలి. సరైన ఆధారాలు చూపించకపోతే డబ్బును స్వాధీనం చేసుకొని గ్రీవెన్స్‌ కమిటీకి అప్పగిస్తాం.

Updated Date - Apr 12 , 2024 | 11:04 PM