నర్సింగ్ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తా
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:21 PM
నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ యాజమాన్యంతో మాట్లాడి మీ సమస్యను పరి ష్కరిస్తానని కలెక్టర్ విజయేందిర బోయి ఆ కళా శాల నర్సింగ్ విద్యార్థులకు చెప్పారు.

మహబూబ్‌నగర్ కలెక్టరేట్, అక్టోబరు 25, (ఆంధ్రజ్యోతి): నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ యాజమాన్యంతో మాట్లాడి మీ సమస్యను పరి ష్కరిస్తానని కలెక్టర్ విజయేందిర బోయి ఆ కళా శాల నర్సింగ్ విద్యార్థులకు చెప్పారు. శుక్రవారం ఆ కళాశాల నర్సింగ్ విద్యార్థులు కలెక్టర్ కార్యా లయంలో కలెక్టర్‌ను కలిసి కళాశాల యాజమా న్యం, స్టాఫ్ కలిసి విద్యార్థులను ఎలాంటి మాన సికంగా వేధింపులకు గురిచేస్తున్న విషయాన్ని కలెక్టర్‌కు తెలిపారు. ప్రతి విద్యా సంవంత్సరం కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న (ఫీజు రీయింబర్స్‌మెంట్) స్కాలర్‌షిప్పు ను ప్రభుత్వం విడుదల చేయలేదని, గత, ప్రస్తు త విద్యాసంవంత్సరం స్కాలర్‌షిప్ కూడా పెం డింగ్ ఉందని, పెండింగ్ ఫీజు కడితేనే పరీక్ష రాయనిస్తామని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ కళాశాల మేనే జ్‌మెంట్‌తో మాట్లాడి సమస్యను పరిష్కస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని అక్కడున్న దేవకకద్ర శాసనసభ్యులు జీఎంఆర్‌కు తెలియ జేశారు. కలెక్టర్ ను కలిసిన వారిలో మొదటి, రెండవ, ఫైనలియర్ చదువుతున్న 50 మంది విద్యార్థులు ఉన్నారు.