Share News

సర్కార్‌ బడులకు ‘సోలార్‌’ కాంతులు

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:10 PM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్‌ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్‌ ఏర్పాటు చేస్తోంది.

సర్కార్‌ బడులకు ‘సోలార్‌’ కాంతులు
ఉత్తనూరు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానల్‌

- సౌర విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు

- ప్రభుత్వ పాఠశాలలకు తప్పిన బిల్లు ఖర్చు

అయిజ, జనవరి 3 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్‌ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్‌ ఏర్పాటు చేస్తోంది. దీంతో విద్యుత్‌ కోతల సమస్య పరిష్కారం కానున్నది. కరెంటు చార్జీల భారం తొలగనున్నది. సమగ్ర శిక్షా అభియాన్‌ ద్వారా నాబార్డు సహకారంతో సౌర యూనిట్లను ఏర్పాటు చేశారు. టీఎస్‌ రెడ్కో (పునరుత్పాదక ఇంధన సంస్థ) ఆదేశం మేరకు ఏర్పా ట్లు కొనసాగుతున్నాయి. జిల్లాలో 85 శాతం ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్‌ సౌకర్యం ఉంది. వాటర్‌ ప్లాంటు, కంప్యూటర్లు, డిజిటల్‌ స్ర్కీన్‌, తరగతి గదుల్లో లైట్లకు విద్యుత్‌ వినియోగానికి వేల రూపాయలు బిల్లులు వస్తున్నాయి. అయితే పాఠశాలలకు సకాలం లో నిధులు రాకపోవడంతో బిల్లుల చెల్లింపుకు ఆటం కం కలుగుతోంది. దీంతో కొన్ని పాఠశాలకు విద్యుత్‌ సర ఫరా నిలిపివేసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యం లో సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిం ది. సౌర విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు జిల్లాలోని 178 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు.

వినియోగాన్ని బట్టి ఏర్పాట్లు

సోలార్‌ పవర్‌ సౌకర్యం కల్పించేందుకు ఎంపిక చేసిన పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి, ఎంత మేర విద్యుత్‌ అవసరం అవుతుందో అంచనా వేసిఅందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు కిలో వాట్‌ నుండి 10 కిలో వాట్‌ల సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక కిలో వాట్‌కు లక్ష రూపాయల చొప్పున ఖర్చు అవుతోంది. ప్రాథమిక పాఠశాలలకు రెండు కిలోవాట్లు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఐదు కిలోవాట్‌లు, అలాగే వినియోగం ఎక్కువగా ఉండే కస్తూర్బా విద్యాలయాలు, ఆదర్శ గురుకులాల్లో 10 కిలోవాట్‌ల సామర్థ్యం ఉన్న యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. గుర్తించిన అన్ని పాఠశాలలో ఏర్పాట్లు పూర్తయితే కరెంట్‌ కష్టాలు తీరనున్నాయి.

విద్యుత్‌ సమస్య పరిష్కారం

ఎంపిక చేసిన పాఠశాలల్లో సోలార్‌ పవర్‌ ఏర్పాట్లు పూర్తయితే విద్యుత్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. అన్ని పాఠశాలల్లో ఏర్పాట్లు పూర్తయితే విద్యుత్‌ కోతలు, బిల్లుల చెల్లింపు నుంచి బయట పడవచ్చు. వీటి ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం.

- సిరాజుద్దీన్‌, జిల్లా విద్యాధికారి

Updated Date - Jan 03 , 2024 | 11:10 PM