Share News

రెండో రోజు ఆరిగురు నామినేషన్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:54 PM

లోకసభ ఎన్నికల నామినేషన్‌లలో భాగంగా రెంవ రోజైన శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆరుగురు నామినేషన్లను దాఖలు చేశారు. అందులో మహబూబ్‌నగర్‌లో ఐదుగురు, నాగర్‌కర్నూలులో ఒక్కరు ఉన్నారు. మహబూబ్‌నగర్‌ లోకసభ నియోజకవర్గానికి ఐదుగురు నామినేషన్లు దాఖలు అయ్యాయి.

రెండో రోజు ఆరిగురు నామినేషన్‌
నాగర్‌కర్నూల్‌లో నామినేషన్‌ దాఖలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌; చిత్రంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌ యాదవ్‌, గువ్వల బాలరాజు

మహబూబ్‌నగర్‌లో ఐదుగురు, నాగర్‌కర్నూల్‌లో ఒకరి దాఖలు

నాగర్‌కర్నూల్‌/మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌/మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : లోకసభ ఎన్నికల నామినేషన్‌లలో భాగంగా రెంవ రోజైన శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆరుగురు నామినేషన్లను దాఖలు చేశారు. అందులో మహబూబ్‌నగర్‌లో ఐదుగురు, నాగర్‌కర్నూలులో ఒక్కరు ఉన్నారు. మహబూబ్‌నగర్‌ లోకసభ నియోజకవర్గానికి ఐదుగురు నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వంశీ చందర్‌ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జి. రవినాయక్‌కు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌ రెడ్డి తరఫున ప్రతిపాదకులు టీ. శ్రీధర్‌ రెడ్డి ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థులుగా హరీందర్‌ రెడ్డి, ఎస్‌. సరోజమ్మ, ఉమాశంకర్‌లు మూడు నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తంగా ఐదుగురు ఆరు సెట్లు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. నాగర్‌కర్నూలు ఎంపీ స్థానంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారం బీజేపీ అభ్యర్థిగా భరత్‌ప్రసాద్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మల్లురవి తమ నామినేషన్లను దాఖలు చేశారు.

Updated Date - Apr 19 , 2024 | 10:54 PM