Share News

ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:53 PM

ఎన్నిలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతా మని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్ర వారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కల్యా ణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం
కల్యాణలక్ష్మి చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి

- ఎల్‌వోసీలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పెద్దమందడి/పెబ్బేరు/శ్రీరంగాపూర్‌, జనవరి 12 : ఎన్నిలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతా మని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్ర వారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కల్యా ణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గతంలో చెక్కుల కోసం ఎమ్మెల్యే కాం్యపు ఆఫీస్‌ ముందు పడిగాపులు కాసేవారని, ఇప్పుడు ఆ అవసరం లేదని, లబ్ధిదారులకు మండల కేంద్రంలోనే పంపిణీ చేస్తామని తెలిపారు. కృష్ణ బేషిన్‌లో ఈ సంవత్సరం వర్షపాతం తక్కువ నమోదు కావడంతో రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని తెలిసి కూడా సాగుకు నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేయడం బీఆర్‌ఎస్‌ నాయకుల ఆవివేకమన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను 117 మంది లబ్ధిదారులకు అందజేశారు. అంతకు ముందు మోజర్ల గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి వైద్య ఖర్చుల కోసం మంజూరైన రూ.2.50 లక్షల ఎల్‌ వోసీని బాధితుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. అదేవిధంగా పెబ్బేరు మండల పరి షత్‌ కార్యాలయంలో 141 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అంద జేశారు. అదేవిధంగా శ్రీరంగాపూర్‌ తహిసీల్దార్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కల్యా ణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్దమందడి ఎంపీపీ రఘుప్రసాద్‌, అమ్మపల్లి సర్పంచు రమేష్‌యాదవ్‌, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామచంద్రయ్యగౌడ్‌, నాయకులు రామకృష్ణారెడ్డి, పుట్టమోని నారాయణ, పెబ్బేరు ఎంపీపీ శైలజ, జడ్పీటీసీ సభ్యురాలు పద్మ, మునిసిపల్‌ చైర్మన్‌ ఎద్దుల కరుణశ్రీ, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ కర్రెస్వామి, తహసీల్దార్‌ లక్ష్మి, శ్రీరంగాపూర్‌ జడ్పీటీసీ సభ్యుడు ఎం.రాజేంద్రప్రసాద్‌యాదవ్‌, తహిసీల్దార్‌ మురళిగౌడ్‌, ఎంపీడీవో ప్రసన్న కుమారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 10:53 PM