Share News

సింగరేణి వేలం పాటను వెంటనే ఆపాలి

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:34 PM

సింగరేణి వేలంపాటను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ పార్కు ఎదుట నిరసన చేపట్టారు.

సింగరేణి వేలం పాటను వెంటనే ఆపాలి
నిరసన కార్యక్రమంలో సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ నాయకులు

- మునిసిపల్‌ పార్కు ఎదుట సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ పార్టీ నిరసన

నారాయణఫేట టౌన్‌, జూలై 5 : సింగరేణి వేలంపాటను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ పార్కు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాస్‌లైన్‌ డివిజన్‌ కార్యదర్శి కాశీనాథ్‌ మాట్లా డుతూ జాతీయ వనరులను, సంపదలను, ఖని జాలను కేంద్రం కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడు తోందని ఆరోపించారు. దేశంలోని 500 కోల్‌బ్యాక్‌లలో ఇప్పటికే 300 బ్లాక్‌లను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడం జరిగిందన్నారు. సింగరేణి లాంటి సంస్థలను బలోపేతం చేయకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం తగదన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో సింగరేణి ఉనికికి ముప్పు పొంచి ఉందన్నారు. సింగరేణి వేలం పాటను విరమించుకోవాలన్నారు. దీనిపై ప్రభుత్వ, రాజకీయ, కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణిలోని 42వేల మంది కార్మికుల రక్షణకు పాటుపడాలన్నారు. అక్రమార్కులకు ప్రభుత్వాలు వరంగా మారాయన్నారు. కార్యక్రమంలో రాము, ప్రశాంత్‌, కెంచి నారాయణ, నరసింహా, బుట్టో, రామాంజనేయులు, కృష్ణయ్య, రాంచందర్‌, కృష్ణయ్య, హన్మంతు, సాయి, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 10:34 PM