ఆదర్శంగా తీసుకోవాలి
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:47 PM
వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని ఆద ర్శంగా తీసుకుని ప్రస్తుత విద్యార్థులు కూడా భవి ష్యత్తులో కళాశాలకు మంచి పేరు తీసుకురావా లని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అ న్నారు.

- వనపర్తి ప్రభుత్వ కళాశాల స్వర్ణోత్సవాల్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి రూరల్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని ఆద ర్శంగా తీసుకుని ప్రస్తుత విద్యార్థులు కూడా భవి ష్యత్తులో కళాశాలకు మంచి పేరు తీసుకురావా లని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అ న్నారు. వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆదివారం స్వర్ణోత్సవాలు నిర్వహించ గా, ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులైన తెలం గాణ ఎలక్ర్టిసిటీ నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ దేవరాజుల నాగార్జున, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డితో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఇదే కళాశాలలో చదివి ప్రస్తుతం ఉన్నత స్థాయికి ఎదిగిన ఆర్‌జేడి రా జేంద్రసింగ్, గద్వాల అదనపు కలెక్టర్ లక్ష్మీ నా రాయణ సహా పలువురు తమ సహచర పూర్వ విద్యార్థులతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ ఆదర్శ్ సురభిని కళాశాల పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఈ సందర్భంగా పూ ర్వ విద్యార్థులు అందరూ కలిసి సమాజంలో బా ధ్యత కలిగిన పౌరులం అంటూ సమాజ పర్యా వరణ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశా రు. తమకు విద్యా బుద్ధులు నేర్పి ఉన్నత స్థాయి కి చేర్చిన తమ గురువులకు ఘనంగా సన్మానిం చారు. కళాశాల స్థాపనకు కీలకమైన వ్యక్తి టైపు కృష్ణయ్య కూతురు సరళను, అప్పటి వనపర్తి ఎ మ్మెల్యే జయ రాములు కుమారుడు శ్రీనివాసులు ను, మరో మాజీ ఎమ్మె ల్యే డాక్టర్ బాలకృష్ణయ్య కుమార్తె జయంతిలను వేదికపైకి ఆహ్వానించి స న్మానించారు.
- త్వరలోనే డిగ్రీ క ళాశాల ఆవరణంలో బా లికలకు బాలురకు వేరు వేరుగా సీఎం రేవంత్‌రె డ్డితో మాట్లాడి హాస్టల్‌ను నిర్మిస్తానని రాష్ట్ర ప్ర ణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు.
- కళాశాల మరింత అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామని ఎంపీ మల్లు రవి అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరిన్ని నిధులు తీసుకువస్తానని అన్నారు.
- ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి వనపర్తిలో ఉన్న విద్యా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు తపన పడుతున్నారని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నా రు. అదే దిశగా మేమంతా ముందడుగు వేస్తూ మరింత బలోపేతం చేస్తామని అన్నారు.
- భావితరాల భవిష్యత్తు కోసం విద్యను అ గ్రభాగంలో నిలిపానని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నా హయాంలో మంజూరు అయి న బీసీ మహిళా కళాశాల, జెఎన్‌టీయూ కళాశా ల నిర్మాణాల కోసం మౌలిక వసతుల కల్పన కోసం చిన్నారెడ్డి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ... ఉమ్మడి మహబూబ్ న గర్ జిల్లాలోని వనపర్తి పట్టణం విద్యావ్యాప్తిగా పేరు గాంచిందని చెప్పారు. ఎలక్ర్టిసిటీ రె గ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నాగార్జున మా ట్లాడుతూ... పూర్వ విద్యార్థులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కళాశాల అ భివృద్ధి కోసం పూర్వ విద్యార్థిగా తన వంతుగా ల క్ష రూపాయల విరాళం ఇస్తున్నానని ప్రకటించా రు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రిన్సి పాల్ రఘునం దన్, సభాధ్యక్షులు శ్రీనివాసులు, మాజీ అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు, మీడి యా కమిటీ స మన్వయకర్త మాల్యాల బాలస్వా మి, పూర్వ వి ద్యార్థులు వెంకటేశ్వరరావు, ప్రభుత్వ న్యాయవాది కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.