Share News

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:08 PM

నారాయణపేట శ్రీసాయి స్కూల్‌లో మంగళవారం పదో తరగతి విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
ఊట్కూర్‌ సీపీఎస్‌ పాఠశాలలో ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు

నారాయణపేట, మార్చి 12 : నారాయణపేట శ్రీసాయి స్కూల్‌లో మంగళవారం పదో తరగతి విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి పలువురిని ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో శేషమ్మ, కవిత, గోపాల్‌రెడ్డి, సురేంద్రనాథ్‌, బాలప్ప పాల్గొన్నారు.

ఊట్కూర్‌ : మండల కేంద్రంలోని సీపీఎస్‌ పాఠశాలలో బుధవారం విద్యార్థులు స్వ పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడంతో పాటు, కలెక్టర్‌, డీఈవో, ఎంఈవోలుగా పాఠశాలకు రావడం పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థులే ఉపాధ్యాయులుగా చక్కటి పాఠశాలను బోధించారు. కలెక్టర్‌గా సిద్దునాయక్‌, డీఈవోగా దీక్షిత, ఎంఈవోగా శ్రీవిద్య పాఠశాలను సందర్శించి పరిశీలించడం, తనిఖీలు చేయడం ఆకట్టుకుంది. అలాగే పాఠశాల హెచ్‌ఎంగా నందితతో పాటు ఉపాధ్యాయులుగా ఇతర విద్యార్థులు వ్యవహరించారు. హెచ్‌ఎం సునంద విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శకుంతల, భ్రమరాంభ, శిరీష, రాధాదేవి, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 11:09 PM