Share News

‘అమృత్‌ భారత్‌ రైల్వే’కు ఎంపికవడం శుభ పరిణామం

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:43 PM

రైల్వేల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో గద్వాల రైల్వే జంక్షన్‌ ఎంపిక కావడం శుభపరిణా మమని

‘అమృత్‌ భారత్‌ రైల్వే’కు ఎంపికవడం శుభ పరిణామం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ రాములు, వేదికపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ముసిని వెంకటేశ్వర్లు

- ఎంపీ పోతుగంటి రాములు

- గద్వాల రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం

- వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

- ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ప్రసంగాన్ని వీక్షించిన ఎంపీ, ఎమ్మెల్యే

గద్వాల అర్బన్‌, ఫిబ్రవరి 26 : రైల్వేల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో గద్వాల రైల్వే జంక్షన్‌ ఎంపిక కావడం శుభపరిణా మమని నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. అమృత్‌ భారత్‌ స్టేష న్‌ పథకంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ వేదికగా 554 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి, 1500 ఆర్‌వోబీ, ఆర్‌యూబీ పనులను వర్చువల్‌గా ప్రారం భించారు. అందులో భాగంగా రూ.9.49 కోట్ల వ్యయంతో గద్వాల స్టేషన్‌ పునరాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముసిని వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, రైల్వే అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగాన్ని అధికారులు, ప్రజాప్రతి నిధులు ఎల్‌సీడీ స్ర్కీన్‌పై వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ పోతు గంటి రాములు మాట్లాడుతూ గద్వాల రైల్వేజంక్షన్‌ కోసం సంస్థనాదీళులు అందించిన వంద ఎకరాల ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి మాట్లాడు తూ మూడు రాష్ట్రాలకు కేంద్ర బిందువుగా ఉన్న గద్వాల స్టేషన్‌లో అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాల న్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌ సమీపంలో ప్రజలకు ఉపయోగపడేలా ఉద్యాన వనంతో పాటు కల్యాణమండపం వంటివి నిర్మించాలని కోరారు. రైల్వే డివిజన్‌ అధికారి అరుణ్‌ కుమార్‌ శర్మ మాట్లా డుతూ గద్వాల రైల్వేస్టేషన్‌లో ప్రధాన ద్వారంతో పాటు ప్రయాణ ప్రాంగణం, స్టేషన్‌ లోపల, బయట పరిసరాల పరిశుభ్రత, లిఫ్టులు, ఎస్కలేటర్లు, వన్‌ స్టేషన్‌, వన్‌ ప్రాడక్ట్‌ దుకాణాలు, ట్రాఫిక్‌ వసతులు, లైటింగ్‌, అప్‌గ్రేడ్‌పార్కింగ్‌తో పాటు దివ్యాంగులకు అనుకూలంగా మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హైదరా బాద్‌ రైల్వే డివిజన్‌ అధికారులు, స్థానిక రైల్వేస్టేషన్‌ అధి కారులు మున్నాజీరావు, అమిత్‌ కుమార్‌, వెంకటప్ప ఉన్నారు.

- ‘వికసిత భారత్‌, వికసిత రైల్వే’ అనే అంశాలపై నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఎంపీ, ఎమ్మెల్యే, మునిసిపల్‌ చైర్మన్‌, అదనపు కలెక్టర్ల చేతుల మీదుగా బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు.

ఆర్‌యూబీలు ప్రారంభం

అలంపూర్‌ చౌరస్తా/ ఉండవల్లి/ ఇటిక్యాల : అమృత్‌ భారత్‌స్టేషన్‌ పథకంలో భాగంగా ఉండవల్లి శివారులోని 124వ గేట్‌ వద్ద, అలంపూర్‌ స్టేషన్‌ వద్ద 129 గేట్‌ ఆర్‌యూ బీలు, ఇటిక్యాల మండలంలోని 108, 110 రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జిలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పిడుగు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వర రెడ్డి, జగదీష్‌, మాజీ సర్పంచు సొంటి శ్రీనువాసులు, రైల్వే టెలికాం ఎస్‌ఎస్‌ఈ వెంకటరమణ, టెక్నీషియన్‌ సత్యనా రాయణ, రైతుసంఘం సభ్యుడు శేఖర్‌రెడ్డి, ఇటిక్యాల, చాగాపురం ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వరమ్మ, చెన్నపాటి రాముడు, తహసీల్దార్‌ నరేందర్‌, ఎంఈవో రాజు, పెద్దదిన్నె మాజీ సర్పంచు గోవర్ధన్‌రెడ్డి, తిమ్మారెడ్డి, జయరాంరెడ్డి, స్టేషన్‌ సూపరింటెండెంట్‌ భగీరథ మీనన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 11:43 PM