Share News

28న సైన్స్‌ సంబురాలు

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:00 PM

జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈనెల 28న సైన్స్‌ సంబురాలు నిర్వహించాలని డీఈ వో అబ్దుల్‌ ఘనీ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.

28న సైన్స్‌ సంబురాలు
రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన బుజ్జమ్మకు ప్రశంసాపత్రం అందిస్తున్న డీఈవో

నారాయణపేట, ఫిబ్రవరి 25 : జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈనెల 28న సైన్స్‌ సంబురాలు నిర్వహించాలని డీఈ వో అబ్దుల్‌ ఘనీ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సైన్స్‌ సంబురాల్లో భాగంగా సైన్స్‌ ప్ర యోగాలు, సెమినార్లు, ఒక శాస్త్రవేత్త గురించి, పరిశోధనలు, ప్రభావాలు, వ్యాస రచన, క్విజ్‌, ఒరిగామి, సైన్స్‌ పుస్తకాల ప్రదర్శన, టీఎల్‌ఎం తయారీ, ప్రదర్శన, సైన్స్‌ సామగ్రి ప్రదర్శన, సైన్స్‌ మేళా తదితర కార్యక్రమాలను నిర్వహిం చాలన్నారు. నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించి ఫొటోలు, వీడియోలను ఫైల్‌ చేసి ఉంచాలని డీఈవో సూచించారు.

రాష్ట్ర స్థాయిలో విద్యార్థి ప్రతిభ..

జాతీయ సైన్స్‌ డే సందర్భంగా జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర స్థాయి పోటీలో మరికల్‌ మండలం తీలేర్‌కు చెందిన బుజ్జమ్మ ప్రతిభను చాటి మొదటి బహుమతి సాధిం చిందని డీఈవో తెలిపారు. 33 జిల్లాల నుంచి 396 నామినేషన్లకు గాను జిల్లాకు చెందిన బుజ్జమ్మ ప్రథమ స్థానంలో నిలిచి జిల్లాకు పేరు తీసుకొచ్చిందన్నారు. 28న అతిథుల నుంచి ఈమె ప్రశంసాపత్రం అందుకోనున్నట్లు తెలిపారు. ప్రతిభను చాటిన విద్యార్థిని డీఈవోతో పాటు జిల్లా సైన్స్‌ అధికారి భానుప్రకాష్‌, విద్యా సాగర్‌, సీవీ రామన్‌ సైన్స్‌ ఫోరం అధ్యక్షుడు కనకప్ప, ఉపాధ్యాయులు అభినందించారు.

Updated Date - Feb 25 , 2024 | 11:00 PM