Share News

ఎస్‌బీఐ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోంది

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:08 PM

ఎన్నికల బాండ్ల విషయంలో ఎస్‌బీఐ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తి స్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ అన్నారు.

ఎస్‌బీఐ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోంది
- సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌

వనపర్తి టౌన్‌, మార్చి 11: ఎన్నికల బాండ్ల విషయంలో ఎస్‌బీఐ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తి స్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎస్‌బీఐ అనుకూల వైఖరి ప్రదర్శిస్తుందని సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లలో అమ్మిన ఎన్నికల బాండ్లు, వాటిని కొన్నవారి పూర్తి సమాచారాన్ని ఎన్నికల సంఘా నికి మార్చి 6వ తేదీ వరకు అందించాలని, ఆ వివరాలను ఎలక్షన్‌ కమిషన్‌ మార్చి 13లోగా బహిర్గతం చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిం దన్నారు. కానీ సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరిం చిన ఎస్‌బీఐ చైర్మన్‌ను వెంటనే అరెస్టు చేయాలని, ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎస్‌బీఐ పబ్లిక్‌ బ్యాంక్‌ అని, బీజేపీ బ్యాంక్‌ కాదని, ఎన్నికల బాండ్లు మోదీకి అతిపెద్ద అవినీతి భాగవతంగా మారిందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పుట్ట ఆంజనేయులు, మేకల ఆంజనేయులు, మండ్ల రాజు, ఆర్‌ఎన్‌ రమేష్‌, బొబ్బిలి నిక్సన్‌ తదితరులు పాల్గొన్నారు.

మదనాపురంలో..

మదనాపురం : సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించ ని ఎస్‌బీఐ చైర్మన్‌ను అరెస్టు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వెంకట్రాములు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ మేనేజర్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ ఎన్నికల బాండ్లతో నరేంద్రమోదీ అతి పెద్ద అవినీ తి బాగోతం బయటపడుతుందనే ఎస్‌బీఐ బహిర్గ తం చేయడం లేదని విమర్శించారు. కార్యక్రమం లో పార్టీ నాయకులు ప్రసాద్‌, వెంకటేష్‌, చెన్న య్య, మాసన్న, సత్తన్న, తెలుగురవి, సవరయ్య, రాముడు, కృష్ణయ్య పాల్గొన్నారు.

ఆత్మకూరులో...

ఆత్మకూరు : దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల బాండ్లు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన ఇప్పటి వరకు ఎస్‌బీఐ బ్యాంకు వారు బహిర ్గతం చేయకపోవడం సరైంది కాదని సీపీఎం పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సంద ర్భంగా సోమవారం ఆత్మకూరు పట్టణ కేంద్రంలో ని ఎస్‌బీఐ బ్యాంకు ముందు సీపీఐ పార్టీ ఆధ్వ ర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ.... గత పార్లమెంట్‌ ఎన్నికల సమ యంలో ఆయా పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులను బాండ్లుగా తీసుకుని అడ్డగోలుగా వాడు కున్నారు. తక్షణమే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్లను బహిర్గతం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు వెంకటేష్‌, అజయ్‌, గోపి, రాజు, విజయ్‌, భారతీయుడు శివ, ఖాజా మొగిల న్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 11:08 PM