Share News

సావిత్రిబాయి జీవితం అందరికీ ఆదర్శం

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:52 PM

సంఘ సంస్కర్త ఉపాధ్యా యిని, రచయిత్రి సావిత్రిబాయి ఫూలే జీవితం అందరికీ ఆదర్శమని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు అన్నారు.

 సావిత్రిబాయి జీవితం అందరికీ ఆదర్శం
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు

- జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు

తిమ్మాజిపేట, జనవరి 3 : సంఘ సంస్కర్త ఉపాధ్యా యిని, రచయిత్రి సావిత్రిబాయి ఫూలే జీవితం అందరికీ ఆదర్శమని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా తిమ్మాజి పేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ ఆవరణలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ సావిత్రి బాయి ఫూలే ఆశయాలను సాధించడం కోసం ప్రతీ ఒ క్కరు పునరంకితం కావాలన్నారు. ఎంపీపీ రవీంద్రనా థ్‌రెడ్డి, సర్పంచ్‌ వేణుగోపాల్‌గౌడ్‌, ఎంపీటీసీ లీలావతి, ఎంపీడీవో కరుణశ్రీ, నోడల్‌ అధికారి సత్యనారాయణశెట్టి, కాంప్లెక్స్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు తిరుపతి రెడ్డి, నరసింహారెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్‌లో...

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: భారతీ య సంఘం సంస్కర్త, ప్రథమ ఉ పాధ్యాయని, రచయిత్రి సావిత్రిబా యి ఫూలే జయంతిని బుధవారం జిల్లా కేంద్రంలో పలు ప్రజా సంఘా ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆ ధ్వర్యంలో ఆ సంఘం కార్యాలయం లో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫూలే చిత్ర పటానికి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే సతీమణి, మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సమాజానికి పరిచయం అయ్యిందని పేర్కొన్నారు. కానీ సాయిత్రి బాయి ఫూలే సమాజంలో పాతుకుపోయిన కుల వివక్ష, సతీసహగమనం, బాల్య వివాహాలు, మూఢనమ్మ కాల వంటి దురాచారాలపై పోరాటం చేసి రూపుమా పిన గొప్ప మహిళా శిరోమణి అని కొనియాడారు. సీనియన్‌ సిటీజన్స్‌ జిల్లా అధ్యక్షుడు వార్డెన్‌ చెన్నయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి వెంకట శెట్టి, నాయకులు పాండురంగయ్య, శ్రీనివాసులు, సా యిరెడ్డి, బొడ్డుపాండు, జగన్మోహన్‌రావు, వెంకటేశ్వరరా వు, విష్ణుమూర్తి, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- ఐద్వా ఆధ్వర్యంలో పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫూలే చిత్ర పటానికి జిల్లా అధ్యక్షురాలు కందికొండ గీత పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఐద్వా సంఘం మహిళలు జయలక్ష్మి, కృష్ణవేణి, పాల్గొన్నారు.

- కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫూలే చిత్ర పటానికి కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న పూల మాల వేసి నివాళు లు అర్పించారు. కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చింత శివకుమార్‌, నాయకులు కృష్ణ, శివుడు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 10:52 PM