Share News

జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సంగీతషా

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:11 PM

జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ సంగీతషాను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సంగీతషా
డాక్టర్‌ సంగీతషా

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం) ఆగస్టు 24 : జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ సంగీతషాను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రస్తుతం ఇదే ఆస్పత్రిలో గైనిక్‌ హెచ్‌వోడీగా ఉన్నారు. ఇదివరకు ఉన్న డాక్టర్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌ ఇన్‌చార్జిగా ఉన్నారు. అయితే ఈ సూపరింటెండెంట్‌ నియామకం గందరగోళంగా మారింది. ఇదివరకు ఇన్‌చార్జిగా ఉన్న డాక్టర్‌ జీవన్‌ బదిలీల్లో భాగంగా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జిగా సీనియర్‌ అయిన డాక్టర్‌ హన్‌మత్‌ప్రసాద్‌ను నియమించారు. అయితే ఆయన ఇన్‌చార్జిగా పూర్తి స్థాయిలో కొనసాగేందుకు నిరాకరించారు. దాంతో బదిలీల్లో భాగంగా కోఠి ఈఎన్‌టి ఆస్పత్రి నుంచి జనరల్‌ ఆస్పత్రికి వచ్చిన డాక్టర్‌ సంపత్‌ సీనియర్‌ కావడంతో ఆయనకు సూపరిం టెండెంట్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఉత్తర్వులు రాకపోవడంతో గతంలో ఉన్న డాక్టర్‌ జీవన్‌ కొన్ని ముఖ్యమైన బిల్లులు, సంత కాలు ఇతరత్రా వ్యవహారాలు చూసేవారు. కానీ ప్రభుత్వం అకస్మాత్తుగా గైనిక్‌ హెచ్‌వోడీని సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఇదిలా ఉండగా ఈమె కూడా ఈనెలాఖరు వరకు మాత్రమే ఉంటారని తెలిసింది. ఎందుకంటే వచ్చే నెల మొదటి వారంలో ఏడీఎంఈ పోస్టులకు పదోన్నతులు కల్పించనున్నారు. ఆ పదోన్నతుల ద్వారా పూర్తి స్థాయి సూపరింటెండెంట్‌గా వేరేవారు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా సూపరింటెండెంట్‌ పోస్టు వ్యవహరంలో అందరూ అయోమయంలో పడ్డారు.

Updated Date - Aug 24 , 2024 | 11:11 PM