నిబంధనలను కచ్చితంగా పాటించాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 10:57 PM
విద్యాశాఖ నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా విద్యాధికారి ఎ.ఇందిర ప్రైవేట్ పాఠశాలల యజమా నులను ఆదేశించారు.

- డీఈవో ఇందిర
- ప్రైవేట్ పాఠశాలల ఆకస్మిక తనిఖీ
గద్వాల టౌన్, జూలై 5 : విద్యాశాఖ నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా విద్యాధికారి ఎ.ఇందిర ప్రైవేట్ పాఠశాలల యజమా నులను ఆదేశించారు. పట్టణంలోని విశ్వభారతి ఉన్నత పాఠశాల, బెటర్ లైఫ్ మాడల్ స్కూళ్లను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాంల విక్రయాలు సాగుతున్నట్లు విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో డీఈవో తనిఖీలు చేపట్టారు. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర ఉపకరణాలను పాఠశాలలో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అడ్మిషన్ రిజిస్టర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, ప్రతీ విద్యార్థి వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఆమె వెంట ఎంఈవో సురేశ్, కార్యాలయ అధికారి నరేందర్, సీఆర్‌పీ షమీ ఉన్నారు.