ఆర్టీసీ నూతన సర్వీసులు ప్రారంభం
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:33 PM
కోస్గి డిపో నుంచి ఆర్టీసీ నూతనంగా రెండు సర్వీసులను ప్రారంభించింది.
కోస్గి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కోస్గి డిపో నుంచి ఆర్టీసీ నూతనంగా రెండు సర్వీసులను ప్రారంభించింది. సోమవారం కొడంగల్ డెవలప్ మెంట్ అధికారి వెంకట్‌రెడ్డి కోస్గి డిపోకు మం జూరైన రెండు బస్సులను ఆర్‌ఎం శ్రీదేవితో కలి సి ప్రారంభించారు. మద్దూర్ జాజరావ్‌పల్లి మీ దుగా నారాయణపేటకు ఓ బస్సు, కోయిల్ కొండ-మహబూబ్‌నగర్‌కు మరో బస్సును నడప నున్నామని ఆర్‌ఎం తెలిపారు. కోస్గి డిపోకు మ రిన్ని ఆర్టీసీ బస్సులు మంజూరు చేయాలని అం దుకోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని ఆమె సూచించారు. డీఎం లావణ్య, నారాయణ పేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజ య్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి, కౌన్సిలర్లు, మునిసిపల్ అధ్యక్షు డు బెజ్జురాములు నాయకులు తదితరులున్నారు.