Share News

సెలవులు ముగిసేలోపు మరమ్మతులు పూర్తి

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:31 PM

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతు పనులను వేసవి సెలవులు ముగిసేలోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

సెలవులు ముగిసేలోపు మరమ్మతులు పూర్తి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, ఏప్రిల్‌ 30 : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతు పనులను వేసవి సెలవులు ముగిసేలోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో చేపట్టాల్సిన నిర్మాణ పనులపై మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులను గౌండింగ్‌ చేయాలని ఆదేశించారు. వచ్చే నెల మూడవ తేదీ నుంచి పను లను ప్రారంభిం చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతిపై వారాంతపు నివేదికలను తప్పనిసరిగా అందించాలని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడే చెప్పాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో ఏఏపీ కమిటీలతో పాటు, ప్రతీ మండాలనికి నోడల్‌ అధికారులను నియమిం చినట్లు తెలిపారు. పాఠశాలల్లో తరగతి గదులకు తాత్కాలిక మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం ఇతర పనులు చేపట్టాలన్నారు. తాగునీరు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయల కల్పనకు సంబంధించిన పను లను పూర్తి చేయాలన్నారు. సమావేశానికి అదనపు కలెక్టర్‌ అపూర్వచౌహాన్‌, డీఆర్‌డీవో నర్సింగరావు, డీఈవో ఇందిర, ఎంఈవోలు, ఇంజనీరింగ్‌ అధికారులు హాజరయ్యారు.

Updated Date - Apr 30 , 2024 | 11:31 PM