Share News

సీఎం సహాయనిధితో పేదలకు ఊరట

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:15 PM

ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు కొంత ఊరట లభిస్తుందని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.

సీఎం సహాయనిధితో పేదలకు ఊరట
బాధిత కుటుంబ సభ్యులకు చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే

- అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు

రాజోలి, జులై 15 : ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు కొంత ఊరట లభిస్తుందని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండల కేంద్రమైన రాజోలికి చెందిన బడేసాహెబ్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 20 వేలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే సోమవారం వారి ఇంటికి వెళ్లి కుటుం బసభ్యులకు ఎల్‌వోసీ, చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద ప్రజలకు అండగా ఉంటామని, వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల నాయకులు గంగిరెడ్డి, గోపాల్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, పరశురాముడు, లోకేష్‌, ఫారుక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:15 PM