Share News

సాధారణ బదిలీలు చేపట్టాలి

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:54 PM

రాష్ట్ర వ్యాప్తంగా జెన్‌కో సంస్థ లో ఇంజనీర్లకు ప్రభుత్వం తక్షణమే సాధారణ బదిలీలు చేపట్టాలని శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రం (ఎస్‌ఎల్‌బీహెచ్‌ ఈఎల్‌) బ్రాంచ్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌ కా ర్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు.

  సాధారణ బదిలీలు చేపట్టాలి
ఈగలపెంట జెన్‌కో సీఈ కార్యాలయంలో నేలపై కూర్చొని నిరసన తెలుపుతున్న ఇంజనీర్లు

- సీఈ కార్యాలయంలో నేలపై కూర్చొని ఇంజనీర్ల నిరసన

దోమలపెంట, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా జెన్‌కో సంస్థ లో ఇంజనీర్లకు ప్రభుత్వం తక్షణమే సాధారణ బదిలీలు చేపట్టాలని శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రం (ఎస్‌ఎల్‌బీహెచ్‌ ఈఎల్‌) బ్రాంచ్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌ కా ర్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. ఇంజనీర్ల బదిలీలు చేపట్టాల ని గురువారం అసోసియెషన్‌ ఆధ్వర్యంలో ఈ గలపెంట సీఈ కార్యాలయంలో నేలపై కూర్చొని నిరసన వక్యం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి పది సంవత్సరాలు గడిచినా బదిలీలు జరగకపోవడంతో ఇంజనీర్లు ఆందోళ నలో ఉన్నారని, సాధారణ బదిలీలు ప్రతి సం వత్సరం జరగాల్సిన బదిలీలను గత ప్రభు త్వం కాలయాపన చేసిందన్నారు. శ్రీశైలం భూ గర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో గత కొన్ని సంవ త్సరాల నుంచి తక్కువ మంది ఇంజనీర్లతో పని చేపిస్తూ అదనపు పని భారాన్ని జెన్‌కో యాజమాన్యం మోపుతోందని ఆయన ఆవేద న వ్యక్తం చేశారు. నూతన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖల మాదిరిగానే జెన్‌కోలో కూడా సాధారణ బదిలీలు జరుగు తాయని ఇంజనీర్లు ఎదురు చూసినా ఫలితం లేదన్నారు. జెన్‌కో అనుబంధ సంస్థలు అయిన ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ సంస్థలో బదిలీలు జరిగాయని, టీజీ జెన్‌కోలో ఆ పాలసీ ప్రవేశ పెట్టి బదిలీల ప్రక్రియ చేపడతామని యాజ మాన్యం హామీ ఇచ్చింది.. ఎడునెలలు కావస్తు న్నా ఉలుకూ పలుకూ లేదన్నారు. ఇప్పటి వరకు ముగ్గురు సీఎండీలు మారడం జెన్‌కో లో నూతన డైరెక్టర్లను నియమించక పోవడం తో బదిలీల ప్రక్రియలో పురోగతి లేక ఇంజనీ ర్లకు శాపంగా మారిందని పేర్కొన్నారు. ఇంజ నీర్ల సాధారణ బదిలీలలు జరిగితే తప్పా ఖా ళీల సంఖ్య తేలనుందని, దీంతో నిరుద్యోగు లకు అవకాశం లభిస్తుందన్నారు. గతంలో ఇ చ్చిన నోటిఫికేషన్‌లో ఎంపికైన నూతన ఇం జనీర్లకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు యా జమాన్యం సిద్ధమైంది.. అయినా బదిలీలు చే యకపోగా, కొందరికి రాజకీయ అండదండల తో జెన్‌కో అధికారులు బదిలీలు చేయడం తమను ఆందోళన కలిగిస్తుందని అసిస్టెంట్‌ ఇంజనీర్ల సంఘం కార్యదర్శి చరణ్‌ అన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే బదిలీల ప్రక్రి య చేపట్టాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతామని ఇంజనీర్ల సంఘం హెచ్చరించారు. కార్యక్రమంలో అన్ని విభాగాల ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:54 PM