అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:37 PM
ప్రజాపాల నలో దరఖాస్తు చేసుకున్న అర్హు లందరికీ కొత్త రేషన్‌కార్డులు ఇ వ్వాలని భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు కృష్ణవేణి, గీత, ఉమ్మడి జి ల్లా మాజీ అధ్యక్షులు పి.కళావత మ్మ డిమాండ్ చేశారు.

వనపర్తి రూరల్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాల నలో దరఖాస్తు చేసుకున్న అర్హు లందరికీ కొత్త రేషన్‌కార్డులు ఇ వ్వాలని భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు కృష్ణవేణి, గీత, ఉమ్మడి జి ల్లా మాజీ అధ్యక్షులు పి.కళావత మ్మ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని భారత జా తీయ మహిళా సమాఖ్య కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భ ంగా ఆమె మాట్లాడారు. రేషన్ కార్డులపై సం క్రాంతికి సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం చె బుతోందని, ముందుగా కొత్త రేషన్‌కార్డులు ఇ వ్వాలన్నారు. సన్న బియ్యం మళ్లీ కార్డులు ఉన్న వారికే ప్రయోజనం ఉంటుందని, కార్డులు లేని వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే కా ర్డులు కలిగిన వారి కుటుంబాల్లో పిల్లలు పెరిగి పెద్దవారయ్యారని వారి పేర్లను కార్డుల్లో చేర్చాల ని ఏళ్లుగా అడుగుతున్నా.. పట్టించుకోవడం లేద న్నారు. పాత కార్డులో వారి పేర్లు చేర్చాలన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మహిళకు రూ.2500 ఇ వ్వాలని, పెరిగిన మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. మహిళా ప్రయాణికులను ఆర్టీసీ డ్రైవర్లు కండ క్టర్లు చిన్నచూపు చూస్తున్నారని, స్టేజీల్లో మహి ళలు కనిపిస్తే బస్సులు ఆపడం లేదన్నారు. బ స్సుల్లో సీట్ల కొరకు అడిగితే ఉచిత ప్రయాణికు లకు సీట్లు ఎందుకని ఎగతాళి చేస్తున్నారని, ఫి ర్యాదు చేస్తే అటువంటి సిబ్బందిపై చర్య తీసు కోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేయాలన్నా రు. గీత, జయమ్మ, భూమిక పాల్గొన్నారు