Share News

వైభవంగా రథోత్సవం

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:15 PM

మండలంలోని గట్టుకాడిపల్లి అంజనగిరి క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణ గోవింద నామస్మరణతో మార్మోగింది.

వైభవంగా రథోత్సవం
గట్టుకాడుపల్లిలో రథోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు

ఖిల్లాఘణపురం, ఫిబ్రవరి 25: మండలంలోని గట్టుకాడిపల్లి అంజనగిరి క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణ గోవింద నామస్మరణతో మార్మోగింది. శనివారం అర్ధరాత్రి నిర్వహించిన రథోత్సవం కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయా న్ని విద్యుద్దీపాలతో అందంగా ఆలంకరించారు. పౌర్ణమి వెలుగుల్లో ఆలయం శోభ ఉట్టిపడేలా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం అర్ధరాత్రి అనంతరం ప్రారంభ మైన రథోత్సవం కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథాన్ని లాగడానికి ఆసక్తి కనబరిచారు. అనంత రం పల్లకీలో విగ్రహాలను ఉంచి ఉయ్యాల సేవ నిర్వహించారు. ఆదివారం స్వామి వారు అశ్వ వాహనం, శేష వాహనంపై ఊరేగి ప్రత్యేక పూజ లు అందుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు ధ్వజారోహణం చేసి ఆలయ పూజారులు భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. మంగళ వాయిద్యాలు వినసొంపుగా ఉండడంతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. బ్రహ్మోత్సవాల కు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నదానం చేశారు. ఆలయ పరిసరాల్లో మిఠాయి బొమ్మల దుకాణాలు వెళిశాయి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం రథోత్సవం కార్యక్రమం ప్రశాంతం గా ముగియడంతో ఎస్‌ఐ శ్రీహరి పోలీస్‌ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 11:15 PM