Share News

నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి

ABN , Publish Date - May 22 , 2024 | 11:13 PM

వానాకాలం సాగు కోసం రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను విక్రయించాలని ఎరువుల దుకాణాల యజమానులకు వ్యవసాయ సహాయ సంచాలకురాలు (ఏడీఏ) సంగీతలక్ష్మి సూచించారు.

నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
దుకాణంలోని విత్తనాల ప్యాకెట్లను పరిశీలిస్తున్న ఏడీఏ సంగీత లక్ష్మి

- వ్యవసాయ సహాయ సంచాలకురాలు సంగీతలక్ష్మి

- మన గ్రోమోర్‌ కేంద్రం తనిఖీ

గట్టు, మే 22 : వానాకాలం సాగు కోసం రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను విక్రయించాలని ఎరువుల దుకాణాల యజమానులకు వ్యవసాయ సహాయ సంచాలకురాలు (ఏడీఏ) సంగీతలక్ష్మి సూచించారు. మండల పరిధిలోని మాచర్లలో ఉన్న మన గ్రోమోర్‌ కేంద్రాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. కేంద్రంలోని పురుగు మందులు, రికార్డులు, విత్త నాల నిల్వలను ఆమె పరిశీలించారు. కాలం చెల్లిన పురుగుమందులు, నాణ్యతలేని విత్తనాలను రైతులకు విక్రయించొద్దన్నారు. కాలం చెల్లిన విత్తనాలు, నిషేధిత పురుగు మందులను దుకాణంలో ఉంచు కోవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన విత్తనాలు, ఎరువులనే రైతులకు విక్రయించాలని చెప్పారు. రైతులకు నకిలి విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిల్వ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని డీలర్లను అదేశించారు.

సబ్సిడీపై జీలుగ విత్తనాల పంపిణీ

వడ్డేపల్లి : వడ్డేపల్లి మండల రైతులకు వర్షాకా లానికి సంబంధించి సబ్సిడీపై జీలుగ విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ విస్తరణ అధికారి రాధ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 133 సంచుల జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, 60 శాతం సబ్సిడీతో రైతులకు ఇవ్వను న్నామని పేర్కొన్నారు. 30 కిలోల సంచి ధర రూ.2,790 కాగా, సబ్సిడీపై రైతులు రూ.1,674 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. విత్తనాలు కావాల్సిన రైతులు భూమికి సంబంధించిన పాస్‌ పుస్తకం, ఆధార్‌కార్డు కాపీలతో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు.

Updated Date - May 22 , 2024 | 11:13 PM