విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Dec 31 , 2024 | 11:48 PM
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మీ అ న్నారు.

- జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మీ
- పాఠశాలల తనిఖీలో అధికారులు
- మధ్యాహ్న భోజనం పరిశీలన
ధన్వాడ/మరికల్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మీ అ న్నారు. ధన్వాడ మండలంలోని మందిపల్లి ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీవో సాయిప్రకాష్‌తో కలిసి మధ్యాహ్న భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచిం చారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఆమె ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. అర్హులైన వారందరికి ఇళ్లు వస్తా యని, సర్వే అధికారులకు వివరాలు అందించాలని సూచించారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి సరుకుల నాణ్యతను పరిశీలించారు.
అదేవిధంగా, మరికల్‌లోని ఉర్దూ మీడియం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మండల ప్ర త్యేకాధికారి పి.కృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వంట సామగ్రి, వంట గది, శానిటేషన్ తదితర విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం వంట చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీవో పావని, గ్రామ కార్యదర్శి శ్యాం సుందర్‌రెడ్డి, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ఉన్నారు.