విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:38 PM
సం క్షేమ వసతిగృహాల విద్యార్థులకు నాణ్యమైన భో జనం అందించేందుకే ప్రభుత్వం మెస్ చార్జీలను 40 శాతం పెంచిందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలని అ దనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, నవంబరు 25 : సం క్షేమ వసతిగృహాల విద్యార్థులకు నాణ్యమైన భో జనం అందించేందుకే ప్రభుత్వం మెస్ చార్జీలను 40 శాతం పెంచిందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలని అ దనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సం బంధిత శాఖల జిల్లా అధికారులతో అదనపు క లెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం మాట్లాడారు. ఫుడ్ పాయిజనింగ్ వంటి స మస్యలు తలెత్తకూడదనే మెస్ చార్జీలను 40 శా తం ప్రభుత్వం పెంచిందన్నారు. ఫుడ్ ఫాయిజన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అ ధికారులు, వార్డెన్లపై ఉందన్నారు.