గోనెసంచిలో కుక్కి.. చెరువులో పడేసి
ABN , Publish Date - Jul 31 , 2024 | 11:11 PM
క్షణికావేశంలో తండ్రి కొడుకును చంపడానికి యత్నించాడు. ఈ సంఘటన కొల్లాపూర్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడు(10) చెప్పినట్లు వినడం లేదని, సరిగా చదవడం లేదని కోపంతో కొట్టాడు.
మాట వినడం లేదని కుమారుడిని చంపేందుకు తండ్రి యత్నం
సంచి కదలడంతో ఆరా తీసి, కాపాడిన మత్స్యకారులు
పరారైన వ్యక్తి
కొల్లాపూర్, జూలై 31: క్షణికావేశంలో తండ్రి కొడుకును చంపడానికి యత్నించాడు. ఈ సంఘటన కొల్లాపూర్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడు(10) చెప్పినట్లు వినడం లేదని, సరిగా చదవడం లేదని కోపంతో కొట్టాడు. అనంతరం గోనె సంచిలో ఉంచి, నోట్లో వస్త్రం కుక్కి తన ఆటోలో ఊరి చివర ఉన్న చెరువు వద్దకు తెచ్చాడు. సంచి చెరువులో వేసి, కాళ్లతో తొక్కుతుండగా సంచి కదిలింది. చెరువు కట్టపై ఉన్న మత్స్యకారులు, స్థానికులు గమనించి ఏంటని అడిగారు. అది కుక్క పిల్ల అని బదులిచ్చాడు. మూటలోంచి చిన్నపిల్లాడి ములుగులు వినిపించడంతో వారు మూటను బయటికి తీశారు. సంచి తెరిచి చూస్తే పదేళ్ల బాలుడు ఉన్నాడు. మత్స్యకారులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తుండగానే తండ్రి పరారయ్యాడు. కొల్లాపూర్ ఎస్‌ఐ రుషికేష్ అక్కడికి చేరుకుని బాలుడితో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత తల్లిని పిలిపించి, అప్పగించారు. బాలుడు సురక్షితంగా ఉన్నాడని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.