ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 20 , 2024 | 11:07 PM
మహబూబ్‌నగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ జి.రవినాయక్ ఆదేశించారు.
- కలెక్టర్ జి.రవినాయక్
- జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం
- వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులపై సమీక్ష
మహబూబ్‌నగర్(కలెక్టరేట్), మే 20 : మహబూబ్‌నగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ జి.రవినాయక్ ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సమావేశమందిరంలో కలెక్టర్ జిల్లా అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించి, వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులపై సమీక్షించారు. వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ధా న్యం సేకరణ, చెల్లింపులు, అమ్మ ఆదర్శ పాఠశా లల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస తుల కల్పన, విద్యార్థినీ, విద్యార్థులకు ఒక జత యూనిఫాం సరఫరాకు కుట్టించడం, పార్లమెంట్, శాసనమండలి ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు, పారిశుధ్యం, బయోమెట్రిక్ హాజరు అంశాలపై సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు, చెల్లింపులపై ఆయా శాఖల అధికారులతో సమీక్షిం చారు. వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందు బాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం కొను గోలు చేసిన వెంటనే తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపించాలని అన్నారు. అదేవిధంగా, ట్యాబ్ ఎంట్రీ చేసి మిల్లు నుంచి ట్రక్ షీట్ జనరేట్ చేసి రైతులకు చెల్లింపులు చేయాలని, పౌర సర ఫరా శాఖ అధికారులు ట్రక్ షీట్ పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు, పౌర సరఫరాల శాఖ, సహ కార శాఖ, ఐకేపీ అధికారులు కొనుగోలు కేంద్రా లను సందర్శించి కొనుగోళ్లు సాఫీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు జిల్లాలో 490 పాఠశాలల్లో పను లు ప్రారంభించినట్లు తెలిపారు. అంచనా వ్యయంలో 25 శాతం నిధులు కూడా విడుదల చేసినట్లు, పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు పనుల పూర్తిపై సమీక్షించాలని అన్నారు. ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థినీ, విద్యార్థులకు పాఠశాలలు ప్రారం భానికి ముందే స్కూల్ యూనిఫాంలు ఒక జత సరఫరా చేసేందుకు చేపట్టిన పనులపై సమీక్షించారు. ఇప్పటికే జిల్లాకు అవసరమైన క్లాత్ వచ్చినందున కటింగ్‌కు, కుట్టించుటకు మహిళా సంఘాల ద్వారా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో, పట్టణాల్లో వర్షాకాలానికి ముందుగానే చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఫాగింగ్, ఆంటీలార్వా ఆపరేషన్లు, క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల ద్వారా బయోమెట్రిక్ హాజరు శాతంపై సమీక్షించారు. సకాలంలో హాజరుకాని సిబ్బందిపై మెమో జారీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నిక, పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి కౌంటింగ్ సిబ్బందిని, మైక్రో అబ్జర్వర్‌లను నియామకం చేసి శిక్షణా కార్యక్ర మాలు నిర్వహించాలని ఆదేశించారు. సీఎం కార్యా లయం నుంచి వచ్చిన ఫిర్యాదులు ఈనెలాఖరు లోగా పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రజా వాణి, కార్యాలయ ఫైళ్లను పెండింగ్ లేకుండా పరి ష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.