Share News

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Oct 29 , 2024 | 11:16 PM

ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల రైతులు విని యోగించుకోవాలని కోస్గి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీములు కోరారు.

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
ఖాజీపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మార్కెట్‌ చైర్మన్‌ భీములు

- మద్దూర్‌, దామరగిద్ద మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మద్దూర్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల రైతులు విని యోగించుకోవాలని కోస్గి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీములు కోరారు. మంగళవారం మండలం లోని ఖాజీపూర్‌, చెన్నరెడ్డిపల్లి, అప్పిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక పీఏసీఎస్‌ అధ్యక్షుడు నర్సింహాతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ కృషి చేస్తోందని, పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నర్సింహారెడ్డి, ఎంపీవో రామన్న, గుత్తి పురుషోత్తం, వీరారెడ్డి, హన్మిరెడ్డి తదితరులున్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దు

దామరగిద్ద : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించుకొని మద్దతు ధర పొందాలని అయ్య వారిపల్లి గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పుష్ప అన్నారు. మంగళవారం అయ్యవారిపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్‌ ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో ఏ.చిన్నయ్య, బాలవర్దన్‌ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, అరున్‌, శివప్ప, వెంకటయ్య, సునితమ్మ, వీబీకే మంజుల తది తరులున్నారు.

Updated Date - Oct 29 , 2024 | 11:17 PM