‘పల్స్ పోలియో’ను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2024-02-05T23:09:17+05:30 IST
జిల్లా వ్యాప్తంగా వచ్చేనెల మూడో తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్వైలెన్స్ మెడికల్ అధికారి డాక్టర్ ఎంఏ అజార్ వైద్యాధికారులు, సిబ్బందిని కోరారు.
- సర్వైలెన్స్ మెడికల్ అధికారి డాక్టర్ ఎంఏ అజార్
గద్వాల న్యూటౌన్, ఫిబ్రవరి 5 : జిల్లా వ్యాప్తంగా వచ్చేనెల మూడో తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్వైలెన్స్ మెడికల్ అధికారి డాక్టర్ ఎంఏ అజార్ వైద్యాధికారులు, సిబ్బందిని కోరారు. పల్స్‌పోలియో నిర్వహణపై జిల్లా కేంద్రంలోని పాత డీఎంహెచ్‌వో కార్యాలయంలో డీఎంహెచ్‌వో డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మార్చి మూడున ప్రతీ గ్రామంలో పల్ప్ పోలియో బూత్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆ రోజు ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ హైరిస్క్ పాంత్రాలు, ఇటుక బట్టీలు, చేపలు పట్టే ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్ధప్ప, మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ స్రవంతి, సిబ్బంది మధుసూదన్‌రెడ్డి, నరేంద్రబాబు, తిరుమలేష్‌రెడ్డి, వరలక్ష్మి, వెంకటేష్, నరసయ్య, పుష్ప పాల్గొన్నారు.