Share News

పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శప్రాయం

ABN , Publish Date - May 19 , 2024 | 10:41 PM

సీపీఎం వ్యవస్థాపకుడు కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శప్రాయమని ఎం ప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక ఎడిటర్‌ కే.వెంకటేశ్వర్లు అన్నారు.

 పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శప్రాయం
కల్వకుర్తిలో సుందరయ్య చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

కల్వకుర్తి, మే 19 : సీపీఎం వ్యవస్థాపకుడు కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శప్రాయమని ఎం ప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక ఎడిటర్‌ కే.వెంకటేశ్వర్లు అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని టీఎస్‌యూటీఎఫ్‌ భవన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళుల ర్పించారు. అనంతరం కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి పరుశ రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంప్లాయీ స్‌ వాయిస్‌ పత్రిక ఎడిటర్‌ కే.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య భూస్వామి కుటుంబంలో పు ట్టినప్పటికీ పేదల పక్షాన జీవితాంతం పరితపించారని పేర్కొన్నారు. పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుందని ఆలోచించి పిల్లలను కనలేదన్నారు. సమాజం ఆయన జీవితాన్ని అన్ని విధాలుగా ఆదర్శంగా తీసుకుని ముం దుకు సాగాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, మల్లయ్య, శ్రీనివాసులు, బాలయ్య, కిశో ర్‌, ప్రసాద్‌, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, జగన్‌, యాద య్య, రాజు, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

పెద్దకొత్తపల్లి: పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు అన్నారు. ఆదివారం పెద్దకొత్తపల్లిలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.ఈశ్వర్‌, సీఐటీయూ జిల్లా సహాయ కా ర్యదర్శి దశరథం, మండల కార్యదర్శి బాలస్వామి, ఐకేపీ వీవోఏల సంఘం జిల్లా నాయకులు వెంకటయ్య, హమా లీ సంఘం నాయకుడు రాములు, ఈశ్వర్‌, గ్రామపం చాయతీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రవి, మద్ది లేటి, మల్లయ్య, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

తాడూరు: కార్మిక పక్షపాతిగా నిరంతరం పార్ల మెంట్‌లో కార్మిక సమస్యలపై వెలుగెత్తుతూ ఉద్యమిం చిన నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య అని కేవీపీ ఎస్‌ గ్రామ అధ్యక్షుడు వెన్నుపోతుల వెంకటస్వామి అ న్నారు. తాడూరు మండల కేంద్రంలోని బస్టాండ్‌ దగ్గర కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధం తిని నిర్వహించారు. కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు అంత టి కాశన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకు లు కావలి కాశన్న, చెన్నయ్య, రామస్వామి, కృష్ణ, చిన్న య్య, చంద్రయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

తెలకపల్లి: సీపీఎం నిర్మాత భారతదేశ కార్మిక కమ్యూనిస్టు పార్టీ నిర్మాత ల్లో ముఖ్యులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సంద ర్భంగా మండల కేంద్రంలో ని వివేకానంద చౌరస్తాలో సభ జరిగింది. ఈ సభకు హాజరైన సీపీఎం జిల్లా కా ర్యవర్గ సభ్యుడు ఆర్‌.శ్రీని వాసులు మాట్లాడారు. సీపీ ఎం మండల నాయకుడు గోపాస్‌ లక్ష్మణ్‌, హమాలీ సం ఘం, ఇతర సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

కొల్లాపూర్‌: కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్‌ పు చ్చలపల్లి సుందరయ్య పోరాట పటిమ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు నిర్మిస్తామని సీపీఎం మండల కార్యదర్శి బి.శివవర్మ పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధం తి సందర్భంగా ఆదివారం కొల్లాపూర్‌ పట్టణంలోని ఆ ర్టీసీ బస్టాండ్‌ ముందు ఆయన చిత్ర పటానికి సీపీఎం నాయకులు పూల మాల వేసి నివాళులర్పించారు. సీ పీఎం మండల నాయకులు ఎండి.సలీం, ఎం.మధు, జ ల్లాపురం సురేందర్‌, బత్తిని రాజు, కార్తీక్‌, సి.సత్యం, సి.బి చ్చన్న, శివ, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

పెంట్లవెల్లి: పుచ్చలపల్లి సుందరయ్య చూపిన మార్గం నేటికీ ఆదర్శమని సీపీఎం జిల్లా నాయకుడు ఈ శ్వర్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పుచ్చలప ల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటా నికి పూల మాల వేసి నివాళులర్పించారు. సీపీఎం మం డల నాయకులు హనుమంతు, ఎల్లగౌడ్‌, తిమ్మస్వామి, బాలస్వామి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 10:41 PM