ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:15 PM
గ్రామ పంచాయతీ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) నాయకులు డిమాండ్ చేశారు.

పంచాయతీ కార్మికుల నిరసన
పాలమూరు/మిడ్జిల్/కోయిలకొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) నాయకులు డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన టోకెన్ సమ్మె శనివారం రెండో రోజుకు చేరుకుంది. ఏడాది పూర్తి అయినా కనీస వేతనాలు నేటికీ అమలు చేయకపోవటం దారుణమని వెంకట్రాములు, సి.వెంకటేష్, పి.అరుణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. 11 ఏళ్లుగా పంచాయతీ కార్మికులు తమ సమస్యలపై ఆందోళన చేస్తున్న విషయం గుర్తు చేశారు. కనీస వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, పింఛన్‌తో పాటు రూ.10 లక్షల బీమా సౌకర్యం ఇవ్వాలన్నారు. బీమా బెనిఫిట్స్ ఇవ్వటంతో పాటు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలన్నారు. సెలవులు, బట్టలు, సబ్బులు, నూనెలు, పనిముట్లు ఇవ్వాలనే పలు డిమాండ్లతో ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో బాలు, వెంకట్రాములు, తిమ్మయ్య, రంగయ్య, గంగపురి, ఎల్లమ్మ, చెన్నయ్య, పెంటయ్య, శ్రీను, బాలరాజు, వెంకటయ్య, ఆంజనేయులు, బాలమ్మ, రాజమ్మ పాల్గొన్నారు. మిడ్జిల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు తహసీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన సమ్మెకు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య మద్దతు తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి అమిత్‌షాను బర్తరఫ్ చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నాయకులు వెంకటయ్య, బాలస్వామి, అచ్చలయ్య, చెన్నయ్య, వెంకటేష్, సాయి, చెన్నమ్మ, లక్ష్మమ్మ, భారతమ్మ, మల్లమ్మ ఉన్నారు. కోయిలకొండ నిర్వహించిన పంచాయతీ కార్మికుల సమ్మెకు టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సిములు మద్దతు తెలిపారు. కార్మిక సంఘం నాయకులు చెన్నయ్య, శ్రీనునాయక్, వెంకటయ్య, గోపాల్, బాలకిష్టయ్య, కురుమూర్తి, రాందాస్, వడెన్న, లక్ష్మయ్య, చెన్నయ్య, శ్రీను, ఆంజనేయులు పాల్గొన్నారు.