Share News

సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:03 PM

ధరణి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం కొరకు స్పెషల్‌ డ్రైవ్‌ను సమర్థవంతంగా అమలు చేసి సమస్యలను త్వ రితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అ ధికారులను ఆదేశించారు.

 సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశమైన కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : ధరణి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం కొరకు స్పెషల్‌ డ్రైవ్‌ను సమర్థవంతంగా అమలు చేసి సమస్యలను త్వ రితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అ ధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరంలో ధరణి నూతన మార్గ దర్శకాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్‌ సమావేశ మయ్యారు. జిల్లాలో గల ధరణి సమస్యలపై ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం శుక్రవారం నుంచి మండల స్థాయిలో స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి ధరణి సమస్యల సత్వర పరిష్కారా నికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశిం చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 20మండలాల్లో 2448 ఫి ర్యాదులు ధరణి సమస్యలపై తమ దృష్టికి వచ్చాయ న్నారు. వీటన్నింటికీ పరిష్కారం లభించే దిశగా అధికా రులు క్షేత్రస్థాయిలో సమీక్షించి సమస్యలను పరిష్కరిం చాలని కోరారు. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ప్రతీ మండలంలో ధరణి సమస్యలపై తహసీల్దార్‌ కా ర్యాలయంలో భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదు చేసిన వాటి వివరాలను స మీక్షించుకోవాలని కలెక్టర్‌ ఈ సందర్భంగా కోరారు. ఈ స మావేశంలో ధరణి నూతన మార్గదర్శకాల సమస్యల ప రిష్కారంపై తహసీల్దార్లకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేష న్‌ ద్వారా అవగాహన కల్పిం చారు. ప్రతి తహసీల్దార్‌ కా ర్యాలయంలో ప్రత్యేక బృందా లు ఏర్పాటు చేసుకోవాలని, బృందంలో డిప్యూటీ తహసీ ల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, సర్వేయర్‌, తమకు అందుబా టులో ఉన్న రెవెన్యూ సిబ్బందిని వినియోగించుకోవాలని, గ్రామపంచాయతీల వారిగా భూ ఫిర్యాదులను పరిశీలిం చాలని, అన్ని రికార్డుల పరిశీలన అనంతరం తహసీల్దార్‌ స్థాయిలోనే నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ సూచించారు. సేత్వార్‌, కాస్ర, పహానీ, వన్‌బీ, రిజిస్టర్లు ధరణి అందుబా టులో ఉన్న రికార్డుల ఆధారంగా పెండింగ్‌ దరఖాస్తుల ను, వాటితోపాటు వచ్చిన డాక్యుమెంట్లను బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అసైన్డ్‌ ఇనాం, భూదాన్‌, వక్ఫూ, దేవాదాయ భూముల వివరాలు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. రానున్న పది రోజుల్లోనే అధికారులు అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని, ఎలాంటి ఫిర్యాదులు కూడా పెండింగ్‌లో ఉంచరాదని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ ఏవో చంద్రశేఖర్‌, ఆర్డీవోలు, వివిధ మండలాల తహసీల్దార్లు, ధరణి కో ఆర్డినేటర్‌ సంపత్‌, డీటీ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:03 PM