సమస్యలను నిర్భయంగా తెలపాలి
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:28 PM
బాధితులు తమ సమస్యలను నిర్బయంగా తెలియజేయాలని అదనపు ఎస్పీ ఎన్ రవి అన్నారు.
- ‘ప్రజావాణి’లో అదనపు ఎస్పీ ఎన్.రవి
గద్వాల క్రైం, జనవరి 29 : బాధితులు తమ సమస్యలను నిర్బయంగా తెలియజేయాలని అదనపు ఎస్పీ ఎన్ రవి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో అదనపు ఎస్పీ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడుత .బాధితుల ఫిర్యాదులను చట్టప్రకారం వేగంగా పరిష్కరించాలన్నారు. సునిశితమైన అంశాలకు సంబంధించి ఫిర్యాదుల విషయంలో కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు.