బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆపాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 10:50 PM
సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించి అమ్ముకునేందుకు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని వెంటనే ఆపాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు.

- ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు
- కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
గద్వాల న్యూటౌన్, జూలై 5 : సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించి అమ్ముకునేందుకు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని వెంటనే ఆపాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు ప్రతీ పౌరుడికి దక్కాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, సింగరేణి బొగ్గు బ్లాకులను మోదీ ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు సంఘటిత పోరాటాలు చేయా లన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో వీరభద్రప్పకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహ, ఏఐటీయూసీ జిల్లా కమిటీ సభ్యుడు ప్రకాష్, ప్రభుదాస్, కార్మికులు గజేంద్ర, రఘు తదితరులు పాల్గొన్నారు. ఉన్నారు.
గనులను ‘సింగరేణి’కే కేటాయించాలి
మానవపాడు : బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని సీసీఎం జిల్లా కమిటీ సభ్యుడు రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మం డల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలం నిర్వహిస్తోందన్నారు. వేలం ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో నాయకులు భాస్కర్, రఫీ పాల్గొన్నారు.
బొగ్గు గనుల వేలం రద్దు చేయాలి
అలంపూరు : సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి బి నర సింహ డిమాండ్ చేశారు. అలంపూర్ పట్టణంలోని గాఽఽందీ విగ్రహం వద్ద సీపీఎం పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు గనుల వేలం రద్దు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సిద్ధయ్య, ఆటో డ్రైవర్లు కమాల్, వసంత్ కుమార్, రవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.