Share News

30 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలి

ABN , Publish Date - Mar 06 , 2024 | 10:53 PM

ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థుల స్థాయి ఆధారంగా 30 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలని ఎంఈవో వెంకటయ్య అన్నారు.

30 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలి
సమావేశఽంలో మాట్లాడుతున్న ఎంఈవో వెంకటయ్య

ఊట్కూర్‌, మార్చి 6 : ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థుల స్థాయి ఆధారంగా 30 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలని ఎంఈవో వెంకటయ్య అన్నారు. బుధవారం ఊట్కూర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్‌ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కలెక్టర్‌ సూచనల మేరకు విద్యార్థులను వారి స్థాయి ఆధారంగా ఏ, బీ, సీ గ్రేడ్‌లుగా విభజించాలన్నారు. బీ, సీ గ్రేడ్‌ విద్యార్థులను ఏ గ్రేడ్‌లోకి తీసుకొచ్చేలా 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి, అమలు చేయాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహించే వారు కూడా ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలన్నారు. విద్యార్థులకు మిగిలిన సిలబస్‌ పూర్తి చేసి రివిజన్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో మండల ఎఫ్‌ఎల్‌ఎన్‌ నోడల్‌ అధికారి సురేష్‌, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం సత్యనారాయణ, కార్యదర్శి జగదీష్‌కుమార్‌, లక్ష్మారెడ్డి, ధనుంజయుడు, సీఆర్‌పీలు భీమన్న, మహేష్‌, రాజశేఖర్‌ గౌడ్‌, కృష్ణ, గోపాల్‌ పాల్గొన్నారు.

మెరుగైన విద్య అందించాలి

మాగనూరు : ప్రతీ ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరం ముగింపు వరకు 30 రోజుల ప్రణాళికను విజయవంతం చేసి, విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని మండల నోడల్‌ అధికారి వెంకటయ్య కోరారు. బుధవారం మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండో రోజు కొనసాగాన స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంప్లెక్స్‌ హెచ్‌ఎం నరసింహులు, జిల్లా రిసోర్స్‌ పర్సన్‌ నరేందర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవండంతో పాటు మెరుగైన విద్యను అందించాలన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ రాములు, ఉపాధ్యాయులు స్వప్న, విశాలక్ష్మి, ఎల్లాగౌడ్‌, కృష్ణ, వంశీకృష్ణ, రాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 10:53 PM