Share News

నేటితరం క్రీడాకారులకు ప్రవీణ్‌ స్ఫూర్తి

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:16 PM

జాతీయస్థాయి ఖ్యాతి గాంచిన ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు ప్రవీణ్‌ను నేటి తరం క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకొని రాణించాలని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జితేందర్‌, జీఎఫ్‌ఏ అధ్యక్షుడు బండల వెంకట్రాములు అన్నారు.

నేటితరం క్రీడాకారులకు ప్రవీణ్‌ స్ఫూర్తి
ప్రవీణ్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న సేవా సమితి సభ్యులు

- ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జితేందర్‌

గద్వాల అర్బన్‌, మార్చి 1 : జాతీయస్థాయి ఖ్యాతి గాంచిన ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు ప్రవీణ్‌ను నేటి తరం క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకొని రాణించాలని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జితేందర్‌, జీఎఫ్‌ఏ అధ్యక్షుడు బండల వెంకట్రాములు అన్నారు. ప్రవీణ్‌ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సోమనాద్రి ఫుట్‌బాల్‌ మినీ స్టేడియంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి, జీఎఫ్‌ఏ అధ్యక్షుడు, ప్రవీణ్‌ సేవాసమితి అధ్యక్షుడితో కలిసి పులమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుంచి ఫుట్‌బాల్‌ రాష్ట్ర, జాతీయస్థాయి, సంతోష్‌ట్రోఫీ పోటీల్లో రాణించిన ప్రవీణ్‌, క్రీడా కోటాలో రైల్వే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌)లో ఉద్యోగం సాధించారని గుర్తు చేశారు. గద్వాల ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ తరఫున ఇన్విటేషన్‌ పుట్‌బాల్‌ టోర్నమెంట్లలో రాణించి జట్టు విజయానికి దోహదపడే వాడన్నారు. మూడు రోజుల క్రితం మృతి చెందిన సీనియర్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు సమద్‌ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మధ్యాహ్నం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కోచ్‌ విజయ్‌కుమార్‌, ప్రవీణ్‌ సేవాసమితి అధ్యక్షుడు ఇండికా శివ, సీనియర్‌ క్రీడాకారులు జగన్‌, నవీన్‌, చక్ర, సతీష్‌, రఘు, శివ, మహేష్‌, ప్రదీప్‌, రాజారెడ్డి, భద్ర, శ్రీధర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:16 PM