ప్రజావాణి దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:28 PM
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధా న్యతనిస్తూ ప్రజలు ప్రజావాణిలో చేసుకుంటున్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.
- మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధా న్యతనిస్తూ ప్రజలు ప్రజావాణిలో చేసుకుంటున్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఆమె దరఖాస్తులు, ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఎస్. మోహన్‌రావు, అధికారులు పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.
30లోపు డేటా ఎంట్రీ పూర్తి చేయాలి
జిల్లాలో సమగ్ర ఇంటింటి సర్వే డేటా ఆన్‌లై న్‌లో నమోదు ప్రక్రియను ఈనెల 30 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరే ట్‌లో నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశం లో కలెక్టర్ పలుఅంశాలపై సమీక్షించారు. సర్వే లో వివరాలు నమోదు చేసుకోని వారు ఉన్నట్లైతే వారు పంచాయతీ కార్యదర్శులను, వార్డు అధికా రులను సంప్రదించి మ్యాప్ ఆఫ్ రౌండ్ నిర్వ హించాలని, తప్పులు జరగకుండా వివరాలు నమోదు చేయాలని సూచించారు. మంగళవారం పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అన్ని పంచాయతీలలో ప్రజావిజయోత్స వాలు నిర్వహించి ఈజీఎస్ పనులు మంజూరు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులను సంప్రదించి వారిచేత పనుల ను ప్రారంభించాలని చెప్పారు. ఈ నెల 28 నుంచి 30వరకు భూత్పూర్ మండలం అమి స్తాపూర్ లో రైతుసదస్సు నిర్వహణ, 30న భారీ సభ నిర్వహణ ఉంటుందని చెప్పారు. ముఖ్య మంత్రి పాల్గొననున్న ఈ సభలో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలచే 150కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేసి అధునాతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు ప్రదర్శనలు, లైవ్ డెమోలు నిర్వహిస్తారని తెలిపారు. స్టాల్ ఇన్‌చా ర్జి డీఎఫ్‌వో ఉంటారని, డీఆర్‌వో సమన్వయ అధికారిగా వ్యవహరిస్తారని, అదనపు కలెక్టర్లు పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. సమావేశం లో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డీఆర్‌డీవో నర్సింహులు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తప్పిదాలకు ఆస్కారం ఉండొద్దు
జడ్చర్ల: సర్వే వివరాలు ఆన్‌లైన్ నమోదులో పొరపాట్లు, తప్పిదాలు లేకుండా పూర్తి చేయాల ని కలెక్టర్ సూచించారు. జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శ్లోక పాఠశాలలో ఏర్పా టు చేసిన ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియను ఆమె సోమవారం పరిశీలించారు. త్వరగా పూర్తి చే యాలని, ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికా రులకు తెలియజేయాలని ఆపరేటర్‌లకు సూచిం చారు. కార్యక్రమంలో జడ్చర్ల ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంఈవో పాల్గొన్నారు.