Share News

'ప్రజాపాలన' ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:25 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు ప్రజల కు సూచించారు.

'ప్రజాపాలన' ను సద్వినియోగం చేసుకోవాలి
తక్కశిలలో మహిళ నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే విజయుడు

- అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు

- జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ

ఉండవల్లి, జనవరి 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు ప్రజల కు సూచించారు. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ సజావుగా సాగుతున్నది. ఉండవల్లి మండల పరిధిలోని పుల్లూరు, తక్కశిల, మానవపాడు మండ లంలోని మద్దూరు, పెద్ద పోతుల పాడు, చెన్ని పోతులపాడు గ్రామాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సర్పంచులతో కలసి ప్రారంభించారు. పుల్లూరులో 1,056, తక్కశిలలో 1,135 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో తెలిపారు. మద్దూ రులో 715, చెన్నిపోతులపాడులో 463, పెద్దపోతుల పాడులో 554 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో సర్పంచులు నారాయణమ్మ, మద్దమ్మ, పీఏసీఎస్‌ చైర్మ న్‌ గజేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు వరలక్ష్మి, మత్స్య శాఖ జిల్లా అధికారి గోపాల్‌, ఎంపీడీవో ఆంజనే యరెడ్డి, తహసీల్దార్‌ వెంకట్రావ్‌, పరమేశ్వర్‌ రెడ్డి, రఘురెడ్డి, వెంకట్‌రెడ్డి, చాంద్‌బాషా, మానవపాడు మండల ప్రత్యేక అధికారి నాగేంద్రం, ఎంపీడీవో రమణరావు, ఏవో సుబ్బారెడ్డి, పాల్గొన్నారు.

గట్టు : మండల పరిధిలోని లింగాపురం, బల్గెర, తప్పెట్లమొర్సు గ్రామాల్లో శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. బల్గెరలో జడ్పీటీసీ సభ్యు రాలు బాసు శ్యామల, ఎస్‌డీసీ సుబ్రహ్మణ్యం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. తప్పెట్లమొర్సులో ఎంపీపీ విజయ్‌, తహసీల్దార్‌ ధనుంజయ పాల్గొన్నారు. లింగాపురంలో వైస్‌ ఎంపీపీ సుమతి పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ రవికుమార్‌, ఎంపీవో మహేశ్‌, సర్పంచులు హన్మంతునాయుడు, కృష్ణయ్యగౌడ్‌, సూర్యగౌడు పాల్గొన్నారు.

‘అభయహస్తంతో అన్ని వర్గాల అభివృద్ధి

ధరూరు : అభయ హస్తం పథకంతో అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ నజుమున్నీసా బేగం అన్నారు. ధరూరు మండల పరిధిలోని మాల్దొడ్డి గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బండ్ల లక్ష్మీచంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్య క్రమంలో తహసీల్దార్‌ ఖాతూన్‌, పంచాయతీ కార్యదర్శి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

ఇటిక్యాల : మండలంలోని ఇటిక్యాల, షాబాద్‌ గ్రామాల్లో శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంపీవో భాస్కర్‌లు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిం చారు. మండల ప్రత్యేకాధికారి విజయ్‌ కుమార్‌ రెడ్డి షాబాద్‌ గ్రామంలో కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఇటిక్యాలలో 837 దరఖాస్తులు, షాబాద్‌లో 892 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఐ భీంసేనరావు, అజిత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు

మల్దకల్‌ : అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఎంపీపీ రాజారెడ్డి అన్నారు. మండలంలోని ఎల్కూరు, పాల్వాయి గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచు శివరామిరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు యశోద జీవన్‌రెడ్డి, ఉప సర్పంచు రంజిత్‌, తహసీల్దార్‌ హరికృష్ణ, డీటీ సురేశ్‌ బాబు, ఎంపీడీవో కృష్ణయ్య, ఎంపీవో ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

గద్వాల టౌన్‌ : గద్వాల మునిసిపాలిటీ పరిధిలోని 32 వార్డులో శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. మునిసిపల్‌ కమిషనర్‌ కె.నర్సింహ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మునిసి పాలిటీలోని 32, 33 వార్డుల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో 2,284 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 16,369 దరఖాస్తులు వచ్చి నట్లు ఆయన చెప్పారు.

Updated Date - Jan 05 , 2024 | 11:25 PM