Share News

విద్యుత్‌ శాఖ ఉలికిపాటు

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:04 PM

పాలమూరు విద్యుత్‌ శాఖ ఉలిక్కిపడింది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో విద్యుత్‌శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారుల్లో తీవ్ర కలవరం నెలకొంది.

విద్యుత్‌ శాఖ  ఉలికిపాటు
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ భవనం

రైతుల విద్యుత్‌ కనె క్షన్‌ల తనిఖీలపై సీఎం ఆగ్రహం

మహబూబ్‌నగర్‌ ఎస్‌ఈ ఎన్‌ శ్రీరామమూర్తిపై బదిలీ వేటు

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 2: పాలమూరు విద్యుత్‌ శాఖ ఉలిక్కిపడింది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో విద్యుత్‌శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారుల్లో తీవ్ర కలవరం నెలకొంది. రైతుల వ్యవసాయ కనెక్షన్‌లను తనిఖీ చేయడంపై ప్రభుత్వం సీరియ్‌సగా స్పందించడంతో పాటు ఓ ఉన్నతాఽధికారిని సస్పెండ్‌ చేసింది. మరో అధికారిని బదిలీ చేయడంతో విద్యుత్‌ శాఖలో అంతా గ్‌పచుప్‌ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ కనెక్షన్‌లను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు వినియోగిస్తున్నారనే అంశంపై విద్యుత్‌ అధికారులు తనిఖీలకు శ్రీకారం చుట్టారు. విషయం కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని రాష్ట్ర స్థాయిలో డిస్కమ్‌ డైరెక్టర్‌ను సస్పెండ్‌ చేసి, మహబూబ్‌నగర్‌ ఎస్‌ఈ శ్రీరామమూర్తిని బదిలీ చేసింది.

అసలేం జరిగింది?

హైదరాబాద్‌ శివారు చుట్టుపక్కల వ్యవసాయ బోర్లను వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు అంటే ఫాంహౌ్‌సలు, పరిశ్రమలు, వెంచర్లులకు వినియోగిస్తుండటంతో వాటిని తనిఖీ చేసి, కేసులు నమోదు చేయాలని విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. శివారు ప్రాంతాలలో చాలా వరకు వ్యవసాయం ఉండదు. వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఇతర పనులకు ఉపయోగించడం వల్ల దుర్వినియోగం అవుతోందని భాగ్యనగర శివారు ప్రాంతాలలో వ్యవసాయ కనెక్షన్‌లను తనిఖీలు చేయాలని అధికారులు చెప్పారు. అయితే.. వారి కింది స్థాయి అధికారులు జిల్లా స్థాయి విద్యుత్‌ అధికారుల సమావేశంలో అన్ని వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లను తనిఖీలు చేయాలని చెప్పడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఉన్నతాధికారులు సైతం జిల్లాల్లో వ్యవసాయ బోర్లను ఏయే అవసరాలకు వినియోగిస్తున్నారో తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చారు. ఫౌలీ్ట్రఫామ్‌లు, ఇటుక బట్టీలు, ఫిల్టర్‌ ఇసుక తయారీకి వ్యవసాయ బోర్లను ఏమైనా వాడుతున్నారా? అన్న అంశంపై పలు జిల్లాల్లో విద్యుత్‌ అధికారులు తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. మిగతా అధికారులంతా కిందిస్థాయి అధికారులకు నోటిమాటగా చెప్పగా.. మహబూబ్‌నగర్‌ ఎస్‌ఈ శ్రీరామమూర్తి మాత్రం అధికారుల వాట్సాప్‌ గ్రూప్‌లలో రాత పూర్వక మెసేజ్‌లు పెట్టి, ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్‌లు తిరిగి.. తిరిగి ప్రజా పాలనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చేరాయి. ఆయన సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఎస్‌ఈని వెంటనే అటాచ్‌ చేసి, విచారణ చేపట్టారు. సీఎండీ స్థాయిలో తాము జిల్లాలకు ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం హైదరాబాద్‌ శివారు ప్రాంతాలలోని వ్యవసాయ బోర్లను మాత్రమే తనిఖీ చేయాలని చెప్పామని, కింది స్థాయిలో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వచ్చిందని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ ఎస్‌ఈ మూర్తిని బదిలీ చేసి, నారాయణపేట ఎస్‌ఈ వి.ప్రభాకర్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. విద్యుత్‌ అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించడంతో జిల్లా విద్యుత్‌ అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. దాంతో విద్యుత్‌శాఖలో ష్‌గ్‌పచుప్‌ వాతావరణం ఏర్పడింది. ఎవరిని కదిలించినా తమను ఇన్‌వాల్వ్‌ చేయకండని తప్పించుకుంటున్నారు. కింది స్థాయి అధికారుల్లోనూ తనిఖీల విషయంలో భయం నెలకొంది.

Updated Date - Feb 02 , 2024 | 11:04 PM