శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ కీలకం
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:31 PM
శాంతిభద్రతలతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ కీలకమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
- కలెక్టర్ సిక్తా పట్నాయక్
- శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం
- ఎస్పీ యోగేష్‌గౌతమ్
నారాయణపేట టౌన్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతలతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ కీలకమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో సోమవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ హాజరయ్యా రు. ముందుగా పోలీస్ అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులు అర్పించి వందనం సమర్పిం చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం, ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. పోలీసు అమర వీరుల కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా కలెక్టరేట్ నుంచి సహకారం అందిస్తామన్నారు. ఎస్పీ యోగేష్‌గౌతమ్ మాట్లాడుతూ విధి నిర్వ హణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 214 మంది అమరులయ్యా రని గుర్తుచేశారు. ఆ తర్వాత జిల్లాకు చెందిన పోలీస్ అమరుడైన రాజారెడ్డి కుటుంబ సభ్యుల ను కలెక్టర్, ఎస్పీలు పరామర్శించారు. కుటుంబా నికి భరోసా కల్పించి జ్ఞాపికలను అందించారు. అ లాగే జిల్లా పోలీసు పరేడ్ మైదానం నుంచి జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరులను స్మరించుకుం టూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ట్రైనీ కలెక్టర్ గరీమానరుల, అదనపు ఎస్పీ రియాజ్, డీఎస్పీ లింగయ్య, ఆర్డీవో మేఘాగాంధీ, డీఎంహెచ్‌వో డా.సౌభాగ్యలక్ష్మీ, సీఐలు శివశంకర్, రాంలాల్, చంద్రశేఖర్, దస్రునాయక్, ఆర్‌ఐ నర్సింహ, ఎస్సైలు వెంకటేశ్వర్లు, భాగ్యలక్ష్మీరెడ్డి, కురుమయ్య, మురళి, రమేష్, సునీత, అశోక్ బాబు