Share News

పోచమ్మ తల్లీ.. చల్లంగా చూడు

ABN , Publish Date - Jul 23 , 2024 | 11:01 PM

గ్రామ దేవత పోచమ్మ తల్లీ చల్లగా చూడాలని కోరుతూ మంగళవారం ప్రజలు ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు.

పోచమ్మ తల్లీ.. చల్లంగా చూడు
మరికల్‌లో బోనాలతో ఊరేగింపుగా వెళ్తున్న మహిళలు

- ఘనంగా బోనాల పండుగ

- ఆకట్టుకున్న పోతురాజు విన్యాసాలు

మరికల్‌, జూలై 23 : గ్రామ దేవత పోచమ్మ తల్లీ చల్లగా చూడాలని కోరుతూ మంగళవారం ప్రజలు ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. మండల కేంద్రంలో ఉదయం ముదిరాజ్‌ కుల సంఘం సభ్యులు గజలమ్మ బోనం కుండ ఊరేగింపుతో కట్ట మైసమ్మకు బోనం సమర్పించడంతో సంబురాలు అంబరాన్ని అంటాయి. ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయం ప్రకారం సాయంత్రం బొంత చంద్రప్ప, జయమ్మ వారసులు వెంకట్‌, కృష్ణ, సతీష్‌, రఘు ఇంటి నుంచి పెద్ద బోనం కుండతో పాటు అయా కాలనీల్లో ప్రతీ ఇంటి నుంచి మహిళలు బోనాలు ఎత్తుకొని గ్రామ పురవీధుల గుండా శివ సత్తుల పూనకాలు, కాళికామాతా, రేణుకా ఎల్లమ్మ, పోతురాజు విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, యువత డీజే నృత్యాలు కేరింతలు మధ్య పోచమ్మ అమ్మవారి ఆలయం చుట్టూ బోనాలతో ప్రదిక్షణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని ఆ తల్లిని వేడుకున్నారు.

Updated Date - Jul 23 , 2024 | 11:01 PM