Share News

పేట - కొడంగల్‌ ఎత్తిపోతలను.. పూర్తి చేస్తాం

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:02 PM

నారాయణ పేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఊట్కూర్‌ మండలాన్ని సస్యశా మలం చేస్తానని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

పేట - కొడంగల్‌ ఎత్తిపోతలను..   పూర్తి చేస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- ఊట్కూర్‌ను సస్యశ్యామలం చేస్తా -

మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- రాజకీయాలకు అతీతంగా అర్హులకు ఆరు గ్యారెంటీలు

ఊట్కూర్‌, జనవరి 9 : నారాయణ పేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఊట్కూర్‌ మండలాన్ని సస్యశా మలం చేస్తానని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మండలంలోని పులిమామిడి గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విజయోత్సవ సన్మాన సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 69 జీవోను అమలు చేసి ఎత్తిపోతల ద్వారా నీరు అందడానికి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి మాట్లాడటం జరిగిందన్నారు. పెద్దజట్రం నుంచి పులి మామిడి గ్రామాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెద్దజట్రం గేటు నుంచి జక్లేర్‌ వరకు రూ.32 కోట్లు టీఆర్‌ఎఫ్‌ నిధులతో రోడ్డు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మక్తల్‌ నియోజకవర్గంలో సా గునీరు అందుతూ అభివృద్ధి చెందిన మా గనూర్‌, కృష్ణ మండలాలతో సమానంగా ఊట్కూర్‌ మండలాన్ని అభివృద్ధి చేస్తాన న్నారు. పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. అర్హత కలిగిన వారికి నేరుగా న్యాయం చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి వారికి సంక్షేమ పథకాలను ఇవ్వడానికే ప్రతీ గ్రామంలో ప్రజాపాలన నిర్వహించిందన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్ప క అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ఆసుపత్రిని 24 గంటల ఆసుపత్రి చేయాలని, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ మంజూరు చేయించాలని సర్పంచ్‌ పెద్ద సూరయ్యగౌడ్‌ కోరగా ఆసుపత్రి అభివృద్ధిపై మంత్రి దామోదర రాజ నర్సింహతో మాట్లాడంతో పాటు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. అంతకుముందు సర్పంచ్‌తో పాటు మాజీ సర్పంచ్‌ చిన్న సూరయ్యగౌడ్‌ ఎ మ్మెల్యేను శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందించారు. అనంతరం జడ్పీ చైర్‌ పర్సన్‌ వనజ ఆంజనేయులు గౌడ్‌, మక్తల్‌ మాజీ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రవికుమార్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు బాలకిష్టారెడ్డి, కొత్తకోట కార్తీక్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి మాట్లా డారు. కార్యక్రమంలో పగిడిమారి మాజీ సర్పంచ్‌ బస్వరాజ్‌గౌడ్‌, ఓబ్లాపూర్‌ ఉప సర్పంచ్‌ వెంకటేష్‌గౌడ్‌, నాయకులు సత్యనారాణయణరెడ్డి, మోహన్‌రెడ్డి, శంకర్‌, అశోక్‌, ఖాజా పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 11:02 PM