Share News

పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం

ABN , Publish Date - Sep 11 , 2024 | 11:26 PM

అర్హులైన ప్రతీ ఒక్క రికి సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నా రు.

పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం
తాడూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి

- నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి

తాడూరు/తిమ్మాజిపేట/తెలకపల్లి, సెప్టెంబరు 11 : అర్హులైన ప్రతీ ఒక్క రికి సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నా రు. బుధవారం తాడూరు తహసీల్దార్‌ కార్యాలయ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీసేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తహ సీల్‌ ఆవరణలో 31 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ కార్యక్రమం ఇ ప్పటికే ప్రారంభమైందని, ఇప్పటివరకు రూ.రెండు లక్షలలోపు ఉన్న రైతులకు రుణమాఫీ జరిగిందని, మరికొద్దిరోజుల్లో ఆపై ఉన్న రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందన్నారు. అనంతరం పీహెచ్‌సీని పరిశీలించారు. ఆసుపత్రి స్థితిగ తులపై ఆరా తీసి సమస్యల పరిష్కారం కోసం డీఎంహెచ్‌వోకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత గణనాథుని వద్ద జడ్పీటీసీ మాజీ సభ్యురాలు రోహి ణిగోవర్ధన్‌రెడ్డి దంపతులు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నా రు. కార్యక్రమంలో విండో చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ మహ మ్మద్‌ఆలీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అదేవిధంగా, తిమ్మాజిపేటలోని రైతువేదికలో 31 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే అందించారు. తహసీల్దార్‌ జేకే.మోహన్‌, మండల రెవెన్యూ అధికారి రవి, జూనియర్‌ అసిస్టెంట్‌ ఉదయ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, నాయకులు పా ల్గొన్నారు. తెలకపల్లిలోని పరిషత్‌ కార్యాలయంలో 40 మందికి కల్యాణలక్ష్మీ చె క్కులను ఎమ్మెల్యే అందించారు. విండో వైస్‌ చైర్మన్‌ మామిళ్లపల్లి యాదయ్య, మాజీ ఎంపీపీ బండ పర్వతాలు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2024 | 11:26 PM