Share News

జన జాతర

ABN , Publish Date - May 23 , 2024 | 11:36 PM

ప్రతీ రోజూ తెల్లవారగానే ఊర్లల్లో ఉపాధి కూలీలు నెత్తిన తట్ట, చేతుల్లో పార, గునపంతో ఉపాధి పనుల కు వెళ్తున్నారు.

జన జాతర
హన్వాడలో ఓ చెరువు వద్ద ఉపాధిహామీ పనికి వచ్చిన కూలీలు

- ఊపందుకున్న ఉపాధి హామీ పనులు

- గ్రామాల్లో గుంపులుగా తరలుతున్న కూలీలు

- ఉమ్మడి జిల్లాలో ప్రతీరోజు 2 లక్షలకు పైగానే హాజరు

- పొలాలకు ఒండ్రు మట్టి వేసుకుంటున్న రైతులు

- సారవంతం అవుతున్న ఇసుక, చౌడు భూములు

మహబూబ్‌నగర్‌, మే 23: ప్రతీ రోజూ తెల్లవారగానే ఊర్లల్లో ఉపాధి కూలీలు నెత్తిన తట్ట, చేతుల్లో పార, గునపంతో ఉపాధి పనుల కు వెళ్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఉపాధి పనుల వద్ద జనజాతరను తలపిస్తోంది. కూలీలు ఇతర పనులు దొరకని పరిస్థితి ఏర్ప డటంతో ఉపాధిహామీ పనులకు భారీగా తరలి వస్తున్నారు. ఇదివరకు సంబంధితశాఖ సిబ్బంది వెంటపడి బతిమాలినా పనులకు రానివారు కూడా ఇప్పుడు గుంపులు గుంపులుగా పనులకు రావడంతో మస్టర్‌ రాయడానికి సిబ్బంది ఇబ్బందిపడాల్సి వస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 1,691 గ్రామ పంచాయతీలలో ఉపాధిహామీ పథకం అమలు చేస్తున్నారు. గురువారం ఉమ్మడి జాల్లా వ్యాప్తంగా 2,03,414 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యా రు. నెలరోజుల క్రితం ఉమ్మడి జిల్లాలో 20 నుంచి 30వేల మంది కూడా హాజరుకానిది ఇప్పుడు లక్షలు దాటుతు న్నారు. ఏ గ్రామంలో చూసినా సగటుకు వంద మందికి పైగానే పనులకు వెళుతున్నారు. కొలతల ప్రకా రం పనులు చేసుకుంటే ఇదివరకు రోజుకు రూ.273 కూలి వస్తుండగా ఇటీవల రూ.303కు పెంచడంతో కూలీలు ఉత్సాహంగా పనులు చేసుకుంటున్నారు. వేసవిలో రైతులు పొలాల్లో కంపచెట్ల తొలగిం పు, ఎరువులు వేసుకోవడం చేస్తుంటారు. ఇదే సమయంలో ఉపాధిహామీ పఽథకంలో ఒండ్రు మట్టి పనులు నడుస్తుండటంతో రైతులు ట్రాక్టర్‌ లు మాట్లాడుకుని తమ పొలాలలో ఒండ్రుమట్టి వేసుకుంటున్నారు. కూలీల ఖర్చులు ఉపాధి హామీ పథకం ద్వారా ఇస్తుండటంతో ట్రాక్టర్‌ కిరాయి రైతు పెట్టుకుని పొలాలలో ఒండ్రు వేయించుకుంటున్నారు. ఇసుక, చౌడు భూ ముల్లో ఒండ్రు మట్టి వేసుకుంటే నేల సారవంతం కావడంతో పాటు నీరు ఆదా అవుతుంది. అందుకే చాలా మంది రైతులు పోటీపడి ఒండ్రుమట్టి వేయించుకుంటున్నారు.

సారవంతం కానున్న నేలలు

ఉపాధి హామీ పథకం ద్వారా ఒండ్రు వేసుకోవడంతో చెల్క, చౌడు, ఇసుక, దుబ్బ నేలలు సారవంతం అవుతాయి. నీటి వసతి ఉన్న రైతులు మడులు ఏర్పాటు చేసుకొని వరిసాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఎక్కడ బోర్లు వేసినా నీరు పుష్క లంగా లభించడంతో చెల్కలను వరిసాగు కోసం అనుకూలంగా మార్చుకున్నారు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లలో నీరు తగ్గి యాసంగి లో చాలా పంటలు ఎండిపోయాయి. ఇప్పుడు వానా కాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తేనే అనుకున్న స్థాయిలో వరిసాగు అవుతుందనే అభిప్రా యాలు వెల్లడవుతున్నాయి. రైతులు నీటి వసతిని దృష్టిలో ఉంచుకొని సాగు చేసుకోవా లని ఎక్కువ సాగుచేస్తే ఇబ్బందు లు పడాల్సి వస్తోందని అధికారు లు రైతులకు సూచిస్తున్నారు.

Updated Date - May 23 , 2024 | 11:36 PM