ప్రజలకు అందించిన సేవలు గుర్తుంటాయి
ABN , Publish Date - Jul 31 , 2024 | 11:20 PM
విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.
- ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల క్రైం, జూలై 31 : విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. పోలీస్‌శాఖలో 34 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించిన హెడ్‌కానిస్టేబుల్ విజయభాస్కర్‌రెడ్డి బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సంద ర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎస్పీ శ్రీని వాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజయభాస్కర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ భవిష్యత్తులో ఏవిధమైన సహాయం కావాలన్నా తమను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వం నుం చి రావాల్సిన బెనిఫిట్స్‌ను త్వరగా అందించేలా చూడాలని సెక్షన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో గద్వాల రూరల్ ఎస్‌ఐ పర్వతాలు, సూపరింటెండెంట్ నాగేందార్, నయీం పాల్గొన్నారు.